Mahbubnagar

News April 22, 2024

MBNR: నేడు తుది గడువు..APPLY చేసుకోండి

image

 పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఈనెల 22న తుది గడువని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్, రీజినల్ కోఆర్డినేటర్ రాజేశ్వరి తెలిపారు. ప్రభుత్వ,ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు వ్యవసాయ,వెటర్నరీ, హర్టీకల్చర్, ఫిషరీస్ డిప్లొమాల్లో చేరేందుకు పదో తరగతి పూర్తయిన విద్యార్థులంతా polycet.sbtet.telan- gana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 22, 2024

పాలమూరులో ‘పాగా’ వేసేది ఎవరో..?

image

MBNRలో లోక్ సభ పోరు రసవత్తరంగా జరగనుంది. చల్లా వంశీచంద్ రెడ్డి(INC), డీకే అరుణ(BJP), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) పోటీ చేస్తున్నారు. ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అత్యధిక సార్లు, జనతా పార్టీ, జనతా దళ్, BJP ఒక్కోసారి గెలవగా, 2009, 14, 19 ఎన్నికల్లో BRS సత్తా చాటింది. ఇప్పటికే విమర్శలు తారస్థాయికి చేరాయి. పాలమూరులో ఈసారి పాగా వేసేదెవరో మీ కామెంట్..?

News April 22, 2024

MBNR: 85ఏళ్లు దాటిన వారికి ‘హోం ఓటింగ్’

image

85ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఇంటివద్దనే ఓటు వేసే సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ విభాగం నోడల్ అధికారి శ్రీధర్ సుమన్ అన్నారు. వృద్ధులకు ఎన్నికల సంఘం ‘హోం ఓటింగ్’ కల్పించిందని ఆయన తెలిపారు. ఓటు విలువపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యం పటిష్టతకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

News April 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒NGKL: పురుగుమందు తాగి AEO సూసైడ్
✒బిజినేపల్లిలో పంచాయతీ కార్మికుడు మృతి
✒SDNR: బైపాస్ రోడ్డులో ప్రమాదం.. యువకుడి మృతి
✒WNPT:గుండెపోటుతో ఇద్దరు మృతి
✒మద్దూర్:చిరుత దాడిలో దూడ మృతి
✒NGKL:రేపటి నుంచి సలేశ్వరం సాహస యాత్ర ప్రారంభం
✒CONGRESS,BJPలో భారీ చేరికలు
✒ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
✒WNPT:మున్సిపల్ చైర్మన్ గా మహేశ్, వైస్ ఛైర్మన్ గా కృష్ణ బాధ్యతలు స్వీకరణ
✒MBNR:KCR రెండు రోజులు రోడ్ షోలు 

News April 21, 2024

NGKL: పురుగుమందు తాగి AEO సూసైడ్

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో పురుగుమందు తాగి ఏఈవో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు.. గోకారం గ్రామ ఏఈవో రామాంజనేయులు(26) కల్వకుర్తి వద్ద పొలంలో పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రామాంజనేయులు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2024

వనపర్తి: గుండెపోటుతో ఇద్దరు మృతి

image

వనపర్తి జిల్లాలో గుండెపోటుతో ఇద్దరు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని వల్లభ్ నగర్‌కు చెందిన బాదగౌని నరేశ్ గౌడ్(45) మరణించారు. నరేశ్ హోలీ రోజు ఇంటి పైనుంచి పడగా నిమ్స్‌కు తరలించారు. శనివారం వెన్నెముకకు సర్జరీకి ప్రయత్నించగా గుండెపోటుకు గురైన ఈరోజు చనిపోయినట్లు బంధువులు చెప్పారు. అలాగే పాన్‌గల్ మండలం కేతేపల్లి వాసి ఎర్రగళ్ల సురేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు.

News April 21, 2024

కొల్లాపూర్: బస్తాలు మోసిన RS ప్రవీణ్ కుమార్

image

కొల్లాపూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బస్తాలు మోశారు. హమాలీలతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. అలాగే స్థానిక ప్రజలతో మమేకమవుతూ.. ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, కూరగాయలు మార్కెట్‌లో ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

News April 21, 2024

షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ప్రమాదం.. యువకుడి మృతి

image

షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రానికి చెందిన గోవు మల్లేశ్.. మోటార్ సైకిల్ పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి శరీరం రెండు భాగాలుగా విడిపోయి నుజ్జునుజ్జు అయింది. కేశంపేట గేటు వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2024

అమ్రాబాద్: ఇక్కడ నల్లమల చెంచులే పూజారులు

image

తెలంగాణ అమర్​నాథ్​గా పిలిచే సలేశ్వరం లింగమయ్య జాతర ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా 3 రోజులే జరుగుతుంది. మిగతా రోజుల్లో ఇక్కడా ఎటువంటి జన సంచారం ఉండదు. ఈనెల 22 నుంచి ఈ జాతర మొదలు కానుంది. 24న పౌర్ణమి కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. 24న జాతర పరిసమాప్తం అవుతుంది. ఈ ఆలయంలో నల్లమల చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు.

News April 21, 2024

NRPT: చిరుత దాడిలో దూడ మృతి

image

మద్దూర్ మండలం పెదిరిపాడ్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. స్థానిక రైతు రామాంజనేయులుకు చెందిన బర్రె దూడపై రాత్రి దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దూడపై చిరుత దాడిని నిర్ధారించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని.. బోన్ వేసి చిరుతను బంధిస్తామని ఫారెస్ట్ అధికారులు చెప్పారు.

error: Content is protected !!