India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BRS అధినేత KCR జిల్లాల పర్యటనలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. ఈనెల 26న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు 27 సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నిర్వహించే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్ననున్నట్లు జిల్లా బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
మరికల్ మండలం ఎలిగేండ్ల గ్రామానికి చెందిన రాఘవేందర్ గౌడ్ బీజేపీ కార్యకర్త. తన పెళ్లి ఆహ్వాన పత్రికపై ఆ పార్టీ నేతల చిత్రాలు ముద్రించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఏకంగా తన పెళ్లి ఆహ్వాన పత్రికపై ప్రధాని మోదీ, MBNR బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫొటోలు ముద్రించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో వైవిధ్యంగా ముద్రించిన ఈ పెళ్లి పత్రిక స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
ఉమ్మడి జిల్లాలో మూడోరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. MBNR పరిధిలో MIM పార్టీ నుంచి షేక్ మున్నా బాషా, ధర్మ సమాజ్ పార్టీ నుంచి జి.రాకేశ్ నామపత్రాలు ఒక్కో సెట్టును రిటర్నింగ్ అధికారి రవినాయక్‌కు సమర్పించారు. NGKL పరిధిలో శనివారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ 3 రోజుల్లో మొత్తం 12మంది అభ్యర్థులు నామపత్రాలు అందించారు. ఈ నెల 21 ఆదివారం కావడంతో నామినేషన్ల ప్రక్రియ ఉండదు.
కర్ణాటకలోని రాయచూరు నుంచి అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. SI శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. కేటి దొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామ పరిసరాలలో శనివారం పోలీసులు పెట్రోల్ నిర్వహిస్తుండగా.. కర్ణాటక నుంచి బొలెరో వాహనంలో 10 కింటాళ్ళ చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జడ్చర్ల, కోస్గిలలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 21న గద్వాల,NGKL,జడ్చర్ల, 22న కల్వకర్తి, 23న కోస్గిలో ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆఫ్లైన్‌లో బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో ఈనెల 24 వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం HCA ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులు, ప్రజలతో మాట్లాడుతారని, రోడ్ షో కూడా నిర్వహిస్తారని వెల్లడించారు. త్వరలోనే పర్యటన వివరాలు ప్రకటిస్తామన్నారు.
✔అమ్రాబాద్: నేటి నుంచి అంజన్న స్వామి ఉత్సవాలు ప్రారంభం
✔నేడు నామినేషన్ ప్రక్రియకు సెలవు
✔కోయిలకొండ:నేటి నుంచి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
✔నేటి నుంచి హనుమాన్ జయంతి వేడుకలు
✔నేడు GDWL,NGKL,జడ్చర్లలో వేసవి క్రికెట్ శిబిరాలు ప్రారంభం
✔పలు నియోజకవర్గంలో పర్యటించిన MLAలు,MP అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు
✔మక్తల్:నేటి నుంచి బీరలింగేశ్వర స్వామి ఉత్సవాలు
✔కొనసాగుతున్న ‘DSC’ శిక్షణ
వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరెట్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోల్చితే ర్యాంకింగ్లో వెనకబడి ఉన్నామని, పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. రైతు భీమా దరఖాస్తులు పెండింగ్లో పెట్టరాదని చెప్పారు. పంటల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.
> సివిల్స్ టాపర్ అనన్య రెడ్డికి సత్కరించిన CM రేవంత్ రెడ్డి > BJP ఎదుగుదలను కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు: DK అరుణ > 22 నుంచి ‘ప్రజల వద్దకు పోలీస్’ ప్రారంభం: ఎస్పీ > NGKL: CM రేవంత్ సభ (ఈనెల 23) ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు > ఉమ్మడి జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు > NRPT: తనిఖీల్లో 25.32 లీటర్ల మద్యం పట్టివేత > ఉపాధి కూలీల పెండింగ్ డబ్బులు ఇవ్వాలి: AIPKMS
పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న టీఎస్ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్షకు ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని గద్వాల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ టి. రామ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు, ఇటీవల పరీక్షలు రాసిన వారు www.polycet.sbtet.telangana.gov.in దరఖాస్తు చేసుకోవాలని, 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.