India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు మోస్తరు వానలు కొనసాగుతాయని IMD వెల్లడించింది. ఇందులో భాగంగా వనపర్తి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40KM వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో అన్ని పార్టీలు బలప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి ఈనెల 23న నామినేషన్ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. ఈనెల 24న బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ వేయనుండగా రోడ్ షోలో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈనెల 25న బీజేపీ అభ్యర్థి భరత్ నామినేషన్ పత్రాలు సమర్పించనుండగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రానున్నారు.
పట్టణం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ మైదానం, కోస్గి పట్టణం, జడ్చర్లలోని డిగ్రీ కళాశాల మైదానం, నాగర్ కర్నూల్ పట్టణం నల్లవెల్లి రోడ్డు చర్చి మైదానం, గద్వాలలోని డీఎస్ఏ మైదానాల్లో క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా శిబిరాల్లో ఉదయం 5:30 గంటల నుంచి ఉ.8:30 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. నెల రోజులపాటు శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ఫీజు మే 6వ తేదీలోపు చెల్లించాలని రీజినల్ కోఆర్డినేటర్ డా.జి.సత్యనారాయణగౌడ్ తెలిపారు. బీఏ, బీకాం విద్యార్థులు పేపరుకు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. బీఎస్సీ, కంప్యూటర్ విద్యార్థులు పేపరు రూ.150, ప్రాక్టికల్ పరీక్షలకు అదనంగా రూ.150 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వచ్చే నెల 26 నుంచి పరీక్షలు ఉంటాయన్నారు.
MBNR కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి రూ.3.31 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. పలు సంస్థల్లో 90% వాటా, మహదేవ ఇన్‌ఫ్రా ఇన్నోవేషన్స్ సంస్థలో 9 వేల షేర్లు ఉన్నాయి. ఆయన వద్ద 24 తులాల బంగారం, సతీమణి పేరిట 1.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.75 లక్షల విలువైన డైమెండ్ ఆభరణాలు, రూ.7.21 లక్షల విలువైన 9కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. కుటుంబానికి 10 ఎకరాల భూమి ఉంది. సొంతిల్లు లేదు. రూ.23.42 లక్షల అప్పులున్నాయి.
రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ పట్టణం సమీపంలోని ఏకో పార్కులో అనుమానాస్పదంగా మృతి చెందిన యువతి వికారాబాద్ జిల్లా బషీర్ బాద్ మండలం పర్వతానికి చెందిన తాండూరు లక్ష్మీ (26)గా పోలీసులు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌లో ముగ్గురు స్నేహితురాళ్లు కలిసి ఉంటూ.. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17న ఊరికి వెళుతున్నానని తన మిత్రులతో చెప్పింది. యువతీ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
✔NRPT: నేడు పలు ప్రాంతాల్లో కరెంట్ కట్ ✔బాలానగర్,నర్వ:నేడు భారాస కార్యకర్తల సమావేశం ✔అచ్చంపేట:కొనసాగుతున్న సలేశ్వరం జాతర ఏర్పాటు ✔పలు నియోజకవర్గంలో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు ✔నీటి ఎద్దడిపై అధికారుల అప్రమత్తం ✔NRPT:నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షిక క్రీడా దినోత్సవం✔పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు ✔మరికల్:నేటి నుంచి వాలీబాల్ పోటీలు ప్రారంభం ✔వేసవి క్రికెట్ శిబిరాలపై అధికారుల ఫోకస్
పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వ్యవసాయ హబ్‌గా మారుస్తానని BRS అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా అపరిస్కృతంగా ఉన్న ఈ ప్రాంత సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి MBNR ఎంపీ సీటు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. పార్లమెంట్ ఇన్చార్జిగా కొనసాగుతున్న సీఎం.. వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. మరోవైపు ఈ స్థానంపై బిజెపి సైతం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి తీరాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. కాగా ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ గెలిచింది.
√MBNR: వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం.
√NGKL:BRS అభ్యర్థిగా RSP నామినేషన్ దాఖలు.
√ పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ:మాజీమంత్రి. √MBNR:కారు ఇక షెడ్డుకే: సీఎం రేవంత్ రెడ్డి.
√NRPT:తనను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: డీకే అరుణ.
√ 2వ రోజు MBNR..6,NGKL..3 నామినేషన్లు దాఖలు.
√ బిజినేపల్లి: అసభ్య ప్రవర్తన టీచర్ సస్పెండ్.
Sorry, no posts matched your criteria.