India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల్లో మొత్తం 9 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. NGKLకు తొలిరోజు భరత్ ప్రసాద్(BJP), మల్లురవి(INC) నామినేషన్ వేయగా, 2వ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS) నామినేషన్ వేశారు. MBNRకు తొలిరోజు డీకే అరుణ(BJP) నామినేషన్ వేయగా.. 2వ రోజు వంశీచంద్ రెడ్డి(INC), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS)తోపాటు 3 స్వతంత్ర అభ్యర్థులు హరేందర్ రెడ్డి, సరోజనమ్మ, ఉమాశంకర్ నామినేషన్ చేశారు.
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా వెలుగొండలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ధరూర్లో 44.3, నారాయణపేట జిల్లా ధన్వాడలో 44.1, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాలలో 43.9, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 43.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. నాలుగున్నర దశాబ్దాలు పాలించి పాలమూరును వలసల జిల్లాగా చేసి, 14 లక్షల మంది వలసలకు కారణం అయిందన్నారు. కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడిన అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ సీఎం స్థాయిలో ఉండి అమర్యాదగా, అగౌరవంగా మాట్లాడడం రేవంత్‌కే చెల్లిందని విమర్శించారు.
దివ్యాంగ <<13080058>>యువతి పట్ల అసభ్యకరం<<>>గా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి కలెక్టర్ ఉదయ్ కుమార్ సస్పెన్షన్ చేసినట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు. బిజినేపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల టీచర్..యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో కలెక్టర్ ఆదేశాలతో చర్యలు చేపట్టినట్లు డీఈవో తెలిపారు.
మహబూబ్నగర్ స్థానిక MVS డిగ్రీ కళాశాలలో ఈనెల 20న కళాశాల ప్లేస్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. పద్మావతి తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ కంపెనీలైన టాటా స్ట్రీవ్, రిలయన్స్ జియో, ఈఎమ్మారై, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్, రామ్ గ్రూప్ వంటి కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు, రెజ్యూమ్ రెండు సెట్లు తీసుకురావాలని తెలిపింది.
హత్య కేసులో నర్వ మండలం పెద్ద కడుమూరు గ్రామానికి చెందిన మొండి బాలరాజుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన మొండి శ్రీనును భూ తగాదాల కారణంగా 2022 జూన్ 11న బాలరాజు దాడి చేసి హత్య చేసినట్లు చేశారని.. ఈ కేసులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయడం మన అందరి అదృష్టమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. RS ప్రవీణ్ నామినేషన్ వేసిన అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే మన జిల్లా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు.
మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి రవి నాయక్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని మెట్టుగడ్డ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు. అది పాడైపోయిందని BRSను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. MBNRలో వంశీచంద్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిన్న BRS అధినేత కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.”20 మంది MLAలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా MLAలను టచ్ చేస్తే మాడి మసైపోతావు” అని అన్నారు.
గద్వాల- ఎర్రవల్లి రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం బైక్, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారులు గద్వాల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.