India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NRPT జిల్లాలో గ్రామాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అర్హత గల వ్యాయమ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు. మే 1 నుంచి 31 వరకు 14 ఏళ్ళలోపు బాలబాలికలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వ్యాయమ ఉపాధ్యాయులు సంబందిత ధ్రువపత్రాలతో ఈనెల 23లోగా జిల్లా క్రీడల అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ఈ విధంగా జరిగింది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రెండు నామినేషన్లు వేయగా.. ఇంటిపెండెంట్‌గా ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నామినేషన్ వేశారు.
✔ఉమ్మడి జిల్లాలో భానుడి భగభగలు.. ఎల్లో హెచ్చరికలు జారీ
✔WNPT:MLA ఎదుట కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం
✔నేడు నామినేషన్ వేసిన డీకే అరుణ, భరత్ ప్రసాద్, మల్లు రవి
✔బిజినేపల్లి:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
✔బీఫామ్ అందుకున్న ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,BMP అభ్యర్థి విజయ్
✔తాగునీటి పై అధికారుల ఫోకస్
✔SDNR:పేలుడు పదార్థాలు పట్టుకున్న పోలీసులు
✔కాంగ్రెస్‌ను కాపాడుకునేందుకే ఆత్మహత్యాయత్నం: గణేష్ గౌడ్
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. గురువారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్గొండ గ్రామంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వెల్గొండకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు మధ్యాహ్నం వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన్నే శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలంగాణ భవన్లో కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రధాని మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. నామినేషన్ల దాఖలు చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలు చేయని కాంగ్రెస్ నాయకులు కోతలు కోస్తున్నారని విమర్శించారు. రైల్వే మార్గాలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామంటున్న CM రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు రాకుండా ఎలా ఏర్పాటు చేస్తావని ప్రశ్నించారు.
ఫరుక్ నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో పోలీసులు ఓ వ్యక్తి వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. చింతగూడెం గ్రామానికి చెందిన యాదయ్య వద్ద 59 జిలెటిన్ స్టిక్స్ పట్టుకున్నట్లు స్థానిక సీఐ ప్రతాప్ లింగం తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పేలుడు పదార్థాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బిజినేపల్లి మండలం పాలెంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. గుడ్లనర్వకి చెందిన శ్రీశైలం పాలెంలో టిఫిన్ కోసం వచ్చాడు. యూటర్న్ తీసుకునే క్రమంలో వెనుక నుంచి మహబూబ్‌నగర్‌కు చెందిన బద్రీనాథ్ బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బద్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందాగా.. స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పాలమూరులో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు నామినేషన్లు వేశారంటే ప్రచార పర్వం జోరందుకోనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. రానున్న రోజుల్లో కురు క్షేత్రంగా మారనుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారానికి బారులు తీరనున్నారు. CM రేవంత్ రెడ్డి 3సార్లు జిల్లాలో పర్యటించారు.
చారిత్రక సంపదకు పుట్టినిల్లు పాలమూరు. ఉమ్మడి జిల్లాకు నంద వంశం నుంచి అసిఫ్ జాహి రాజావంశం వరకు 22రాజావంశాలు ఈ ప్రాంతాన్ని పాలించారు. రాజావంశాలకు కేరాఫ్‌గా 1662నిర్మించిన గద్వాల్ కోట, 18వ శతాబ్దంలో నిర్మించిన వనపర్తికోట, ఖిల్లా ఘనపూర్ కోట, నిజంకోట, ప్రసిద్ధి ఆలయాలు చెన్నకేశవ స్వామి ఆలయం(గంగాపురం), జటప్రోల్ ఆలయం(పెంట్లవెల్లి), గొల్లత్తగుడి(JDCL) పాలమూరు చరిత్రకు ఆనవాళ్లు.
నేడు ‘World Heritage Day’
Sorry, no posts matched your criteria.