India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 20 నుంచి 23 వరకు కొన్ని చోట్ల అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వేడికి సంబంధించి ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నామని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అవసరమైతేనే బయటికి వెళ్లాలని, శిశువులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
భార్య, అత్త కలిసి దాడి చేశారని ఓ అల్లుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై సురేష్ వివరాలు.. అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన చెన్నారెడ్డి తన భార్యతో మంగళవారం రాత్రి గొడవ పడగా ఆమె కోపంతో తల్లిదండ్రుల గ్రామమైన పామిరెడ్డిపల్లికి వెళ్లిపోయింది. అత్తమామల వద్దే ఉంటున్న తన భార్యను కాపురానికి రమ్మని పిలవడానికి వెళ్తే ఆగ్రహంతో అత్త, భార్య కలిసి దాడి చేశారని బుధవారం ఫిర్యాదు చేశారన్నారు.
BJP అభ్యర్థి డీకే అరుణ నేడు నామపత్రాలు సమర్పించనుండగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గడియారం చౌరస్తా కూడలిలో సభ ఏర్పాటు చేయనున్నారు. NGKL లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గురువారం బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామపత్రాలు దాఖలు చేయనున్నారు. BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ 25న రెండోసారి వేసే నామినేషన్ కు గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ హాజరుకానున్నారు.
క్రిస్టియనపల్లిలో ఎంవీఎస్ ప్రభుత్వ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు.HYD మ్యూజిక్ బస్ ఫౌండేషన్,MVS కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాకు మెడ్ ప్లస్, అపోలో,క్రోబాన్ ఐసీఐసీఐ బ్యాంక్,వీఎన్ ఫెర్టిలైజర్స్,స్పందన స్ఫూర్తి,ముత్తూట్ ఫైనాన్స్ తదితర అనేక కంపెనీల ప్రతినిధులు,హెచ్వీడీలు హాజరవుతారని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ బయోడేటా ఫార్మ్స్ తో హాజరు కావాలన్నారు.
✔సర్వం సిద్ధం.. నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
✔ఉప్పునుంతల:నేటి నుంచి బండలాగుడు పోటీలు ప్రారంభం
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔నేడు నామినేషన్లు సమర్పించనున్న డీకే అరుణ, మల్లు రవి, భరత్ ప్రసాద్
✔ధన్వాడ,నర్వ:నేడు కాంగ్రెస్ ఎన్నిక సన్నాక సమావేశం
✔ఎండలు తీవ్రం.. తస్మాత్ జాగ్రత్త:కలెక్టర్లు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వార్షిక పరీక్షలు
పాలమూరు నుంచి UPSCలో 3వ ర్యాంకు సాధించిన అనన్యరెడ్డి, 278వ ర్యాంకు పొందిన ఎహతేదా ముఫసిర్(ఆత్మకూర్) ఇద్దరూ తాతయ్యలో స్ఫూర్తితోనే సివిల్స్ కొట్టారు. ఇద్దరూ దిల్లీలోనే డిగ్రీ చదవడం విశేషం. అనన్యరెడ్డి దిల్లీ యూనివర్సిటీలోని మిరిండా హౌజ్లో, ఎహతేదా ముఫసిర్ ఢిల్లీలోని శ్రీరాం కళాశాలలో బీఏలో డిగ్రీ పూర్తి చేశారు. కాగా వీరిద్దరూ ఎలాంటి కోచింగ్ లేకుండా విజయం సాధించారు.
మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. MBNRలో డీకే అరుణ(BJP), వంశీచంద్ రెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి (BRS) బరిలో ఉన్నారు. NGKLలో భరత్ ప్రసాద్ (BJP), మల్లు రవి (కాంగ్రెస్), RS ప్రవీణ్ కుమార్ (BRS) పోటీలో ఉన్నారు. నామపత్రాలు సమర్పణకు గెజిట్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుండటంతో పాలమూరులో సందడి నెలకొననుంది.
సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 21న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబ్ నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు. గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు జారీ చేసిన ప్రకటనతో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆన్లైన్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పట్టణవాసులు ఇంటిల్లిపాది విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్తుంటారు. ప్రతి ఏడాదిలో జరిగే చోరీల కంటే ఈ వేసవి మూడు నెలల వ్యవధిలోని అధిక శాతం జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అంతర రాష్ట్ర ముఠా సైతం వేసవిని ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకే వేసవి వేళ, ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
నేటి నుంచి ఎంపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 24 వరకు ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉ. 10 గంటల నుంచి మ. 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి అయిదుగురికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.