Mahbubnagar

News April 17, 2024

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు: డీకే అరుణ

image

పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాయ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్, గతంలో బీఆర్ఎస్ ప్రజలను నట్టేట ముంచాయని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు.

News April 17, 2024

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలపాలి: మాజీ మంత్రి

image

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, అనేక వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తమ పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రైతులను 2 లక్షలు అప్పు తీసుకోవాలని వెంటనే మాఫీ చేస్తామని మాట తప్పారని ధ్వజమెత్తారు. అలాగే వారి వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేర్చాలన్నారు.

News April 17, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥UPSCలో ర్యాంకు సాధించిన వారికి..KTR, పలు నేతల అభినందనల వెల్లువ
♥సర్వం సిద్ధం.. రేపటి నుంచి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
♥ఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు.. పలుచోట్ల శోభాయాత్రలు
♥MBNR:ఎకో పార్కులో యువతి మృతదేహం
♥NGKL:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
♥NRPT:’డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి’
♥BSPలో చేరిన మంద జగన్నాథం
♥NGKL:రామాలయంలో దొంగలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

News April 17, 2024

MBNR: ఎకో పార్కులో యువతి మృతదేహం

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎకో పార్కులో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. డెడ్‌బాడీ కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పార్కు సిబ్బంది సమాచారంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆమెకు సుమారు 20ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. మృతురాలికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2024

ఉమ్మడి జిల్లాలో భానుడి భగ భగలు

image

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.9 డిగ్రీలు నమోదైంది. వనపర్తి జిల్లా పానగల్లో 43.7, మహబూబ్నగర్ జిల్లా సల్కరిపేటలో 43.2, నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో 43.0, నారాయణపేట జిల్లా ధన్వాడలో 42.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

News April 17, 2024

తిమ్మాజిపేట: కారుతో ఢీకొట్టి.. కర్రలతో దాడి

image

తిమ్మాజిపేట మండలం గోరిటలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ అజీద్, అదే గ్రామానికి చెందిన ఎండీ మతీన్, ఎండి అఫీజ్‌ల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం దాడి చేయగా బాధితుడు అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఏకంగా కారుతో ఢీ కొట్టి కర్రలతో విచక్షణా రహితంగా దాడికి దిగి హత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

News April 17, 2024

తిమ్మాజిపేట: కారుతో ఢీకొట్టి.. కర్రలతో దాడి

image

తిమ్మాజిపేట మండలం గోరిటలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ అజీద్, అదే గ్రామానికి చెందిన ఎండీ మతీన్, ఎండి అఫీజ్‌ల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం దాడి చేయగా బాధితుడు అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఏకంగా కారుతో ఢీ కొట్టి కర్రలతో విచక్షణ రహితంగా దాడికి దిగి హత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

News April 17, 2024

MBNR: మహిళ హత్య కేసు‌లో నిందితుడికి జీవిత ఖైదు

image

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా ఆరుట్లకు చెందిన రాములు 2019లో చేవెళ్ల బస్టాండులో ఉన్న గండీడ్ మండలం నంచర్లకు చెందిన అంజులమ్మను బైక్ పై ఎక్కించుకున్నాడు. పటాన్చెరు మండలం లక్డారం శివారులో ఆమెను హత్య చేసి నగలు ఎత్తుకెళ్లాడు. ఈఘటనపై తాజాగా సంగారెడ్డి కోర్టు నిందితుడికి శిక్ష విధించింది. నిందితుడు 2003-19లో 10 హత్యలు, చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.

News April 17, 2024

MBNR: ఆ రెండు పార్టీల మధ్య విమర్శలు.!!

image

పాలమూరులో ఒకవైపు సూర్యుని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య సాగుతున్న పరస్పర ఆరోపణలతో నెలకొంటున్న ఉత్కంఠ భరిత వాతావరణంతో అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఇతర నేతలు అంతా BJP, BRSలపై, పార్టీ అభ్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే.. అదే స్థాయిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడుతోంది.

News April 17, 2024

MBNR: ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వంశీచంద్ రెడ్డి

image

మహబూబ్ నగర్ పట్టణం ఎనుగొండలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

error: Content is protected !!