India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు..
✓ మహబూబ్‌నగర్ – 275, ✓ జడ్చర్ల – 274, ✓ దేవరకద్ర – 289, ✓ నారాయణపేట – 270, ✓ మక్తల్ – 284, ✓ కొడంగల్ – 282
✓ షాద్‌నగర్ – 263, ✓ నాగర్ కర్నూల్ – 264
✓ అచ్చంపేట – 339, ✓ కల్వకుర్తి – 271
✓ కొల్లాపూర్ – 292, ✓ వనపర్తి – 307
✓ గద్వాల – 303, ✓ అలంపూర్ – 291
రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,004 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
BRS బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ భారీ రోడ్ నిర్వహించారు. KCR ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు నిలబడ్డాయి.. BRS, కాంగ్రెస్, BJP.. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు పని చేస్తరో.. ఎవరు న్యాయంగా ఉంటారో.. వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడుతాయి. పని చేయని వాళ్లకు వేస్తే ఇబ్బంది పెడుతరు.’ అని హితవు పలికారు.
మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ పాలమూరుకు బతుకుదెరువు చూపారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ఆయన మాట్లాడుతూ.. “అమాయక పాలమూరు ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హామీలకు మోసపోయి గెలిపించారన్నారు. ప్రజలు నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే అధికారం చేపట్టిన కాంగ్రెస్ మోసం చేసిందని” ఆరోపించారు.
లోక్ సభ నియోజకవర్గానికి బలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 42 మంది నామపత్రాలు దాఖలు చేయగా 35 మంది నామపత్రాలను ఆమోదించారు. వివిధ సాంకేతిక కారణాలతో ఏడుగురు అభ్యర్థుల పత్రాలు తిరస్కరించారు.
✔నేడు నాగర్ కర్నూల్ కు మాజీ సీఎం కేసిఆర్ రాక
✔నంచర్ల:నేడు జాబ్ మేళా
✔నేడు PUలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఏర్పాటు
✔పోలింగ్ శాతం పెంచేందుకు పలుచోట్ల అవగాహన సదస్సులు
✔GDWL:నేడు పలు గ్రామాల్లో కరెంట్ కట్
✔అమరచింత:నేడు పట్టణంలో నీటి సరఫరా బంద్
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎంపీ అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీ సర్వే
✔సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను నయవంచన చేశాడని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై నిప్పులు చేరిగారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరికైనా మేలు జరిగిందా అంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికలలో వారిని నమ్మి మోసపోవద్దని కోరారు.
✒కాంగ్రెస్ పాలనలో భయంకరమైన బాధలు:KCR
✒కేసీఆర్ రోడ్ షో విజయవంతం చేయండి:NGKL మాజీ ఎమ్మెల్యే
✒NGKL:మాజీ ఎంపీ మంద జగన్నాథ్ నామినేషన్ తిరస్కరణ
✒6 గ్యారంటీలు అమలు చేసి ఓట్లు అడగాలి:DK అరుణ
✒GDWL:ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిఆర్డిఓ
✒కాంగ్రెస్ కు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు:మల్లు రవి
✒JEE టాపర్‌కు ఘన సన్మానం
✒ఉపాధి కూలీల సమస్యల పరిష్కరించాలి:AIPKMS
✒ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులకు సన్మానం
కాంగ్రెస్ గెలవగానే క్షణాల్లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మరీ హామీ ఇచ్చినట్లుగా చేశారా? అని BRS అధినేత KCR ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు బంధు నిధులు అందలేదని ఫైర్ అయ్యారు. పెళ్లి చేసుకునే యువతులకు తులం బంగారం ఇస్తామని అన్నారు.. మరీ ఇచ్చారా? ఈ ఎన్నికల్లో మోడీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు’ అని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు భయంకరమైన బాధలు పడుతున్నారని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘నా కళ్ళ ముందే తెలంగాణ నాశనం అవుతుంటే యుద్ధం చేస్తాను. ఆమరణ దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన. ఎలాంటి పోరాటానికైనా జనం సిద్ధంగా ఉండాలి. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పలుచోట్ల 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా పానగల్‌లో 44.4 డిగ్రీలు నమోదైంది. నేటి నుంచి మరో 10 రోజులపాటు విపరీతమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని అధికారులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.