Mahbubnagar

News June 6, 2024

NGKL: పిడుగు పడి భార్య మృతి.. భర్తకు తీవ్ర గాయాలు

image

పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన NGKL జిల్లా వెల్దండ మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన బేగారి జంగమ్మ (47) విత్తనాలు నాటేందుకు పొలం వద్దకు వెళ్లింది. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఈ క్రమంలో పిడుగు పడి జంగమ్మ మృతిచెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

News June 6, 2024

MBNR: రెండు దశాబ్దాల్లో ఒక్కసారీ గెలవని కాంగ్రెస్

image

MBNR పార్లమెంట్‌ స్థానానికి 2009 నుంచి 2024 వరకు 4సార్లు పోటీ చేసిన BRS హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. బీజేపీ ఒక్కసారీ గెలుపొందింది. 2009 ఎంపీ ఎన్నికల్లో KCR, 2014లో ఏపీ జితేందర్ రెడ్డి(BRS), 2019లో మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) గెలుపొందగా, తాజాగా డీకే అరుణ(BJP) గెలిచి తొలి మహిళా ఎంపీగా రికార్డుకెక్కారు. 2 దశాబ్దాల్లో జరిగిన 4 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్‌ను విజయం వరించలేదు.

News June 6, 2024

MBNR: ఇద్దరు యువకుల దారుణ హత్య

image

ఉమ్మడి పాలమూరు జిల్లా కడ్తాల్‌ శివారులో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక బట్టర్ ఫ్లై సిటీలో ఇద్దరు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతులు కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందిన శేషిగారి శివ(24), గుండెమోని శివ(29)గా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని కడ్తాల్ పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. 

News June 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం క్రింది విధంగా వర్షపాతం వివరాలు నమోదయ్యాయి. అత్యధికంగా గద్వాల జిల్లా అలంపూర్‌లో 103.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 77.0 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో 48.5 మి.మీ, వనపర్తి జిల్లా రేవల్లిలో 30.0 మి.మీ, నారాయణపేట జిల్లా చిన్నజట్రంలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 6, 2024

గద్వాల: పరీక్ష ఫీజు చెల్లించండి

image

గద్వాల: పాలమూరు యూనివర్శిటీ పరిధిలోని 2010-11 నుంచి 2015-2016 విద్య సంవత్సరంలో డిగ్రీలో అడ్మిషన్ పొందిన విద్యా ర్థులు, బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజు చెల్లించాలని గద్వాల డీగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ కలందర్ బాష తెలిపారు. ఫీజు చెల్లించడానికి ఈనెల 10వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. అపరాధ రుసుం రూ.200తో చెల్లించేందుకు ఆవకాశం ఉందని తెలిపారు.

News June 6, 2024

5నెలల్లోనే తారుమారు.. MBNR కాంగ్రెస్‌లో చర్చ !

image

మహబూబ్‌నగర్‌లో చల్లా వంశీచందర్ రెడ్డి ఓటమిని కాంగ్రెస్ అధిష్ఠానం జీర్ణించుకోలేకపోతోంది. ఇక్కడి 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 5నెలల్లోనే సీఎం రేవంత్ పాలమూరుపై దృష్టిసారించారు. పాలమూరు- మక్తల్ ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కొడంగల్ అభివృద్ధికి నిధులు ఇచ్చారు. అయినా 5నెలల్లోనే పరిస్థితులు తారుమారు కావడంపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది.

News June 6, 2024

వనపర్తి: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్

image

పెబ్బేరులో రాజేందర్ గౌడ్‌పై హత్యాయత్నం కేసుకు పోలీసులు ఛేదించారు. SI హరిప్రసాద్ రెడ్డి వివరాలు.. రాజేందర్‌, భార్య ప్రత్యూషతో కలిసి ఓ స్కూల్ నిర్వహిస్తున్నారు. స్కూల్ PET మహేశ్‌‌తో ప్రత్యుషకు వివాహేత సంబంధం ఉన్నట్లు గుర్తించిన రాజేందర్ పలుమార్లు హెచ్చరించారు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి రాజేందర్ హత్యకు ఈనెల 1న ప్లాన్ చేయగా బెడిసికొట్టింది. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.

News June 6, 2024

MBNR: అత్త ఎంపీ.. కోడలు ఎమ్మెల్యే

image

బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా గెలవడంతో ధన్వాడ ఆడపడుచులు ప్రజాప్రతినిధులుగా రాణించారు. ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు ఆడపడుచులు శాసనసభ, లోక్ సభలో ఒకేసారి ప్రతినిత్యం వహిస్తుండటం విశేషం. డీకే అరుణ మేనకోడలు చిట్టెం పర్ణిక రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పేట కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, తాజాగా అరుణ MBNR ఎంపీగా గెలిచారు. గతంలోనూ ఉమ్మడి జిల్లాలో ధన్వాడకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

News June 6, 2024

MBNR: డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి..?

image

మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించిన డీకే అరుణకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని ఆమె అనుచరులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఆమెకు మహిళా కోటలో మంత్రి పదవి వస్తుందని నమ్మకంతో ఆమె అనుచరులు గుసగుస లాడుతున్నారు. మరీ బీజేపీ కేంద్రం జేజమ్మకు మంత్రి పదవి ఇస్తుందా.? లేదా.? అనే విషయంపై ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.

News June 5, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✔మహబూబ్‌నగర్‌లో ఓటమికి బాధ్యత నాదే: సీఎం రేవంత్ రెడ్డి
✔సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డి తప్పుకోవాలి:DK అరుణ
✔సీసీకుంట: ఊయల చీర బిగుసుకొని చిన్నారి మృతి
✔CM రేవంత్ రెడ్డిని కలిసిన మల్లు రవి
✔BRSలో చేరినందుకు గర్వంగా ఉంది: ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్
✔ఆయా జిల్లాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
✔విద్యార్థుల యూనిఫామ్ పంపిణీపై అధికారుల ప్రత్యేక ఫోకస్