Mahbubnagar

News April 15, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✏ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ:CM రేవంత్ రెడ్డి
✏KCR కట్టిన సెక్రటేరియట్‌లో కూర్చోకండి: నిరంజన్ రెడ్డి
✏MP ఎన్నికల్లో పాలమూరులో గులాబీ జెండా ఎగరాలి: హరీష్ రావు
✏కాంగ్రెస్‌కి 3,4 సీట్లు మాత్రమే వస్తాయి:మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
✏రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న BJPనేతలు
✏ఉమ్మడి జిల్లాలో పగలు సెగలు..రాత్రి చల్ల గాలులు
✏అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం:వంశీ చంద్ రెడ్డి

News April 15, 2024

ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తలు జెండాను వదల్లేదు:CM

image

NRPT:ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ జెండాను వదల్లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జన జాతర సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ జెండా వదలలేరని,కాంగ్రెస్‌ పార్టీ పేదలకు, బీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించింది. వెనుకబడిన సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్‌కు మించింది లేదు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

News April 15, 2024

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేశాం: రేవంత్ రెడ్డి

image

NRPT:ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ‘జనజాతర సభ’లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించాం. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులివ్వాలి. వారికి న్యాయం చేసేందుకే బీసీ కులగణనకు తీర్మానం చేశాం” అని అన్నారు.

News April 15, 2024

త్వరలో లక్ష 30వేల ఎకరాలకు నీళ్లు: సీఎం రేవంత్

image

పాలమూరు పక్కనే కృష్ణా నది ఉన్నా.. గత బీఆర్ఎస్ పాలనలో మనకు చుక్క నీరు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట సభలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో లక్ష 30వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని అన్నారు. వికారాబాద్-కృష్ణ రైల్వే లైన్‌ను ఆనాడు కాంగ్రెస్ కేటాయించిందని.. కానీ BRS, బీజేపీ పార్టీలు కుట్ర చేసి ఆపాయన్నారు. బీఆర్ఎస్ చిత్రహింసలు పెట్టినా.. తమ కార్యకర్తలు కాంగ్రెస్ జెండాను వీడలేదని అన్నారు.

News April 15, 2024

‘పాలమూరు అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం’

image

ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటేకాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన జన జాతర సభలో మాట్లాడారు. నారాయణపేట బిడ్డ అంటున్న డీకే అరుణ నారాయణపేటకు అదనంగా నిధులు తీసుకొచ్చినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేసిన వ్యక్తి డీకే అరుణ అని ఆరోపించారు.

News April 15, 2024

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లిలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరులో 41.4, మహబూబ్నగర్ జిల్లా సల్కార్పేట్ లో 41.4, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 41.0, నారాయణపేట జిల్లా ధన్వాడలో 40.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 15, 2024

MBNR: సీఎం రేవంత్ సభలో చేరికలు..?

image

ఇటీవల BJPకి రాజీనామా చేసిన నాయకులతోపాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టచ్‌లో ఉన్న BRS నాయకులు కూడా పలువురు నేడు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే జన జాతర సభలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో అందరూ చేరుతారా? లేక ఒకరిద్దరు మాత్రమే పార్టీ కండువా కప్పుకుంటారా..? అనేది తేలాల్సి ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని చెప్పొచ్చు.

News April 15, 2024

మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి

image

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నారాయణపేటలో జరిగే జన జాతర సభలో పాల్గొననున్నారు. మరి కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సభ ప్రాంగణానికి సీఎం చేరుకోనున్నారు. సభ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు వెళ్తారని తెలుస్తోంది. కాగా పాలమూరు సొంత జిల్లా కావడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

News April 15, 2024

NRPT: రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న నేతలు

image

నారాయణపేటకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు రథంగ్ పాండు రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. కాగ ఆయన తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు. ఈయనతో పాటు రాజీనామా చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిమూద్ అలీ వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సోమవారం డీకే అరుణతోపాటు కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు.

News April 15, 2024

ఉమ్మడి జిల్లాలో పగలు సెగలు.. రాత్రి చల్ల గాలులు

image

ఉమ్మడి జిల్లాలో పగటి వేళ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు అటు ఇటుగా ఉంటోంది. సాయంత్రం వాతావరణం చల్లబడి, రాత్రి వేళల్లో చల్లగాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో గత 4 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు మాత్రమే నమోదు కాగా.. ఆదివారం జిల్లాలోని గండీడ్ మండలంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒక్కరోజులోనే 1.4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో ఎండ ప్రభావం ఎక్కువగా కనిపించింది.

error: Content is protected !!