Mahbubnagar

News April 25, 2024

ఒకేషనల్‌లో నారాయణపేట టాప్.. వనపర్తికి 18వ స్థానం

image

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలతో పోల్చితే ఒకేషనల్ కోర్సుల్లో మొదటి, రెండో సంవత్సరంలో నారాయణపేట జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఫస్టియర్ లో మహబూబ్ నగర్ 4వ, గద్వాల 5వ, వనపర్తి 16వ, నాగర్ కర్నూల్ 18వ స్థానంలో నిలవగా.. ద్వితీయ సంవత్సరంలో మహబూబ్ నగర్ 4వ, గద్వాల7వ, వనపర్తి 18వ, నాగర్ కర్నూల్ 20వ స్థానంలో ఉన్నాయి.

News April 25, 2024

కృష్ణ: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

image

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సతీష్ వివరాల ప్రకారం.. మండలంలోని హిందూపూర్ గ్రామానికి చెందిన మంగలి రఘు(30) బుధవారం సాయంత్రం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తండ్రి శరణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సతీష్ తెలిపారు.

News April 25, 2024

కాంగ్రెస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం: శ్రీనివాస్ గౌడ్

image

అసెంబ్లీ ఎలక్షన్‌లో బీజేపీ నాయకులు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, బీజేపీలకు మద్దతిచ్చేలా మహబూబ్ నగర్ జిల్లాలో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి మరో సారి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించటం ఖాయమన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని కోరారు.

News April 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
✔నేటి నుండి ప్రారంభం కానున్న ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔MBNR:నవ భారతి విద్యాలయంలో పాలిటెక్నిక్ ఉచిత శిక్షణ
✔నేడు నామినేషన్ వెయ్యనున్న MBNRసిట్టింగ్ ఎంపి శ్రీనివాస్ రెడ్డి,NGKL బిజెపి అభ్యర్థి భారత్ ప్రసాద్, పలు స్వాతంత్ర అభ్యర్థులు
✔MP ఎన్నిక నిర్వహణలపై అధికారుల ఫోకస్
✔NGKL:నేడు గుజరాత్ సీఎం రాక

News April 25, 2024

MBNR,NGKLలో 34 మంది నామినేషన్లు

image

MBNR, NGKL లోక్ సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరు మొత్తం 53 సెట్ల నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం మహబూబ్ నగర్ లో ఏడుగురు అభ్యర్థులు మొత్తం 9 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ లో నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నేడు చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

News April 25, 2024

వృత్తి విద్యలో రాష్ట్రంలోనే నారాయణపేట ‘TOP’

image

ఇంటర్మీడియట్ సాధారణ ఫలితాల్లో దిగువ నుంచి రెండో స్థానంలో ఉన్న నారాయణపేట జిల్లా వృత్తి విద్య ఫలితాల్లో మాత్రం రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దామరగిద్ద, ఉట్కూరు మండలాల్లోని కేజీబీవీల్లోని వృత్తి విద్యా కోర్సులు పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ పాసయ్యారు. ఈ విజయంపై జీసీడీవో పద్మనళిని తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.

News April 25, 2024

సర్వం సిద్ధం.. నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఓపెన్ SSC,ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సెస్సీ పరీక్షకు 12 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,864 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే ఇంటర్ పరీక్షకు 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా 4,013 మంది విద్యార్థులు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

News April 25, 2024

సలేశ్వరం జాతర.. వెళ్లొస్తాం లింగమయ్యా… 

image

సలేశ్వరం ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. 3 రోజుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు లింగమయ్యను దర్శించుకున్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు వస్తున్నాం లింగమయ్యా.. వెళ్లొస్తాం లింగమయ్యా.. భక్తి పారవశ్యంతో తరలివచ్చారు. శివమామస్మరణాలతో నల్లమల మార్మోగింది. ఈ ఏడాది ఎండల తీవ్రతో భక్తుల రద్దీ తగ్గింది. ఉత్సవాలకు పోలీస్ శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. వర్షాలు లేకపోవడంతో ఊపీరి పీల్చుకున్నారు.

News April 25, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

✒ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు.. అమ్మాయిలదే హవా
✒కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
✒సమస్యల పరిష్కారానికి పోటీ చేస్తున్న: బర్రెలక్క
✒కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది:DK అరుణ
✒కారులో తిరిగేందుకు రాజకీయాల్లోకి రాలేదు:RS ప్రవీణ్
✒వేసవి సెలవులు.. పిల్లలపై కన్నేసి ఉంచండి: SPలు
✒GDWL: తనిఖీల్లో రూ.6,76,920 సీజ్
✒సర్వం సిద్ధం.. రేపటి నుంచి ఓపెన్ INTER,SSC పరీక్షలు

News April 25, 2024

NRPT: ఈత సరదా విషాదం కాకూడదు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యా సంస్థలకు వేసవి సెలవులు రావడంతో విద్యార్థులు ఈత కొట్టేందుకు జలాశయాలు, చెరువులు, కుంటల వద్దకు వెళ్తుంటారు. ఈత సరదా కుటుంబంలో విషాదం నింపకుండా పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని NRPT జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. విషాదాలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సూచించారు. పిల్లలను ఒంటరిగా పంపించొద్దని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిల్లలపై కన్నేసి ఉంచాలన్నారు.