India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి పాలమూరులో ఎంపీ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న జరిగే కౌంటింగ్‌తో ఈ టెన్షన్‌కు తెరపడనుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందనే దానిపై ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ప్రజలూ ఆసక్తిగా గమనిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. MBNRలో, NGKLలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా RTV Survey తాజాగా వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో BJP-10, INC-6, BRS-0, MIM- ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మహబూబ్ నగర్- BJP, నాగర్ కర్నూల్‌లో INC గెలవబోతున్నట్లు RTV Survey పేర్కొంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్‌లో BRS ఖాతా తెరవదని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని MBNR, NGKL నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎన్నికలసంఘం అధికారిక వెబ్ సైట్ results.eci.gov.inను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు కూడా వెబ్‌సైట్‌ను సంప్రదించి ఫలితాలను తెలుసుకోండి

సోమవారం నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్‌తోపాటు నల్గొండ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారంలో పూర్తిగా రాష్ట్రంలో విస్తరించనున్నాయి. రాష్ట్రంలో చురుగ్గా ఇవి కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి RS ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, BJP నుంచి భరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కొన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాగా.. మరికొన్ని బీఆర్ఎస్, బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మీరేమంటారు.

నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సోమవారం చిన్నారెడ్డి అన్నారు. నాణ్యత కలిగిన విత్తనాలనే రైతులు కొనాలని సూచించారు. రైతులు విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే స్థానిక వ్యవసాయ అధికారులకు గాని, పోలీసులకు గాని సమాచారం చేరవేయాలి అన్నారు. వారిపై చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా రాజోలిలో 147.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా బిజ్వారులో 97.5 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో 84.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా దోనూర్లో 77.5 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్లో 76.0 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదయింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీలో ఉన్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కొన్ని బీజేపీకి అనుకూలంగా రాగా.. మరికొన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. PUలో రేపు కౌంటింగ్ జరగనుంది. సీఎం ఇలాకా కావడంతో ఈ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఉమ్మడి జిల్లాలో నేడు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. MBNR, NGKL, వనపర్తి, నారాయణపేట, జిల్లాలలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఆదివారం అర్ధరాత్రి తగిన తర్వాత పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులకు ఎగ్జిట్ పోల్ ఫీవర్ పట్టుకుంది. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్‌లో NGKLలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుస్తారని, MBNRలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుస్తారని పలు సర్వేలు చెప్పాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులకు ఎగ్జిట్ పోల్ టెన్షన్ పట్టుకుంది. MBNR స్థానంలో గెలుపోటములకు 2 శాతం ఓట్ల తేడా ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.