Mahbubnagar

News April 25, 2024

గండీడ్: పెళ్లి చేసుకుంటానని మోసం.. కేసు నమోదు

image

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన గండీడ్ మండలంలో జరిగింది. SI శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతిని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఓ గ్రామానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News April 25, 2024

దేశ భవిష్యత్తుకు బాలికలు దిక్సూచి: ఎస్పీ రితిరాజ్

image

దేశభద్రత, భవిష్యత్తుకు బాలికలు తమ వంతు కృషిచేసి దిక్సూచిలా నిలవాలని ఎస్పీ రితిరాజ్ ఆకాంక్షించారు. మంగళవారం ధరూరు మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ. బాలికల చదువును మధ్యలో ఆపేసి వారి భవిష్యత్ ను ఆగం చేయవద్దని ఎస్పీ సూచించారు. బాలికలకు అత్యున్నత భారత సైన్యంలో అవకాశం కల్పించారని, దాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

News April 25, 2024

మహబూబ్ నగర్:TTC ఫలితాలు విడుదల

image

గత ఫిబ్రవరిలో నిర్వహించిన టీటీసీ (టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్) ఫలితాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిందని MBNR,NGKL DEOలు రవీందర్, గోవిందరాజులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులు https://portal.bsetelangana.org/DPSE1STYEARResultsjun/TSTCCresapr.aspx వెబ్ సైట్ లో ఫలితాలను చూసుకోవాలని సూచించారు.

News April 25, 2024

దేశానికే ఆదర్శం మన పాలమూరు: రేవంత్ రెడ్డి

image

BRS హయాంలో పాలమూరు నేలకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బిజినేపల్లి కాంగ్రెస్‌ సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. ‘దేశానికే ఆదర్శవంతమైన నేతలను ఇచ్చిన గడ్డ మన పాలమూరు. 70ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇక్కడి బిడ్డకు దక్కింది. గతంలో కరీంనగర్‌లో ఓటమి భయంతోనే KCR పాలమూరు MPగా పోటీ చేశారు. KCRకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే RS ప్రవీణ్‌ కాంగ్రెస్‌లోకి వస్తే ప్రభుత్వం డీజీపీగా నియమించేది’ అని అన్నారు.

News April 25, 2024

NRPT: భార్యను హత్య చేసిన భర్త.. 10 ఏళ్ల జైలు శిక్ష

image

నర్వ మండలం కొత్తపల్లికి చెందిన మేకల రాజు తన భార్య సురేఖను హత్య చేసిన కేసులో జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ మంగళవారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. భార్యపై అనుమానంతో 2015 మార్చి 12న భార్యకు నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించగా, కాలిన గాయాలతో చికిత్స పొందుతూ 45 రోజుల తరువాత మృతి చెందిందని, నేరం నిరూపణ కావడంతో 10 ఏళ్ల జైలు 20 వేలు జరిమానా విధించారని చెప్పారు.

News April 25, 2024

మద్దూరు: 35 కోట్ల ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణించారు

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీ పథకాలలో భాగంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడబిడ్డలు లబ్ధి పొందాలని, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. 6 గ్యారంటీ పథకాలలో ఐదు గ్యారంటీ పథకాలు 100 రోజుల్లోనే పూర్తి చేశామని అన్నారు.

News April 25, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✏జోగులాంబ సాక్షిగా.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం:CM రేవంత్ రెడ్డి
✏కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైంది:KTR
✏MP ఎన్నికల్లో భరత్ ప్రసాద్‌ని గెలిపించుకోవాలి: మంద కృష్ణ
✏ఉమ్మడి జిల్లాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
✏కాంగ్రెస్ లో చేరిన RS ప్రసన్న కుమార్
✏ఘనంగా సలేశ్వరం జాతర.. తరలివచ్చిన భక్తులు
✏ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి:AIPKMS
✏నామినేషన్ వేసిన బర్రెలక్క
✏పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

News April 25, 2024

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేటి”TOP NEWS”

image

√NRPT: ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి.
√MBNR:అట్టడుగు వర్గాల సంక్షేమమే మోడీ లక్ష్యం: డీకే అరుణ.
√ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు.
√ పాలమూరు అభివృద్ధికి డీకే అరుణ అడ్డుపడుతుంది:సీఎం.
√NRPT:పనితీరు మెరుగుపరుచుకోకపోతే చర్యలు తప్పవు:కలెక్టర్.
√ అలంపూర్: కాంగ్రెస్ హామీలను అమలు చేయడంలో విఫలమైంది:KTR.
√NGKL:ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్.

News April 25, 2024

కొడంగల్‌ బిడ్డకు.. CM, PCC పదవిని ఇచ్చిందే కాంగ్రెస్

image

ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిని 100రోజుల్లోనే అమలు చేశామని CM రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. KCR మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ బ్యాంకుల వడ్డీకే సరిపోలేదని విమర్శించారు. మద్దూరులో పార్టీ కార్యకర్తలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. CM మాట్లాడుతూ.. కొడంగల్‌ బిడ్డకు కాంగ్రెస్‌ CM, PCC పదవిని ఇచ్చిందని అన్నారు.

News April 25, 2024

కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైంది: కేటీఆర్

image

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.