India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరులోని రెండు లోక్ సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్లలో సగానికిపైగా మగువలే ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. మహిళా ఓటర్లను మెప్పించగలిగితే గెలుపు అవకాశాలు సులభమవుతుందని పార్టీలు భావిస్తున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,205 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. దాదాపుగా 70 శాతం పాఠశాలల్లో వాచ్‌మెన్లు లేరు. దీంతో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటి నేపథ్యంలో పాఠశాలలను పర్యవేక్షించే సిబ్బందిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఆగస్టు 15 లోపు రైతుల కు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తాను రుణమాఫీ చేస్తానని ప్రకటిస్తే మాజీ మంత్రి హరీశ్ రావు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, తాను రుణమాఫ చేసిన వెంటనే బీఆర్‌ఎస్ పార్టీని రద్దు చేస్తారా అంటూ ఆయన సవాల్ విసిరారు. ఏమాత్రం దమ్మున్న తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. నూటికి నూరు శాతం రుణమాఫీ చేసి తీరుతానని చెప్పారు.
సీఎం వరకు తన ప్రస్థానం కొడంగల్ నుంచి ప్రారంభమైందని CM రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ సెగ్మెంట్లో మద్దూరు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మారుమూల కొడంగల్‌కు కాంగ్రెస్ CM పదవి ఇచ్చింది. KCRలా ఫామ్ హౌస్‌లో పడుకోకుండా ప్రజల్లోకి వెళుతున్నాం. మక్తల్ ఎత్తిపోతలకు ఆనాడు డీకే అరుణ అడ్డుపడ్డారు. కృష్ణా జలాల, రైల్వే లైన్ రాకుండా డీకే అరుణ అడ్డుకున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అత్యధికంగా వనపర్తి జిల్లా కేతేపల్లిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా కిష్టంపల్లిలో 43.8, మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 43.6, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 43.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్థానిక సమస్యలతో పాటు అధికార పార్టీపై విమర్శలకు పదును పెడుతున్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అనూహ్యంగా మాజీ ఎంపీ మందా జగన్నాథం బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించిన ఆయన కొద్ది రోజులకే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కలిసి నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం ఉమామహేశ్వరంలో అన్నదానం విరాళాలు పక్కదారి పట్టాయి. రూ.6.16 లక్షలు వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ ఉద్యోగి శంకర్ ఉపయోగించుకున్నారు. విరాళాలు పక్కదారి పట్టినట్టు గుర్తించామని, పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఆలయ కార్యనిర్వహక అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
రెండు లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులు గెలుపోటములను మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. MBNR పరిధిలో 16,80,417మంది ఓటర్లు ఉండగా వీరిలో 8,48,293(50.48 శాతం) మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. NGKL పరిధిలో మొత్తం 17,34,773మంది ఓటర్లుండగా వీరిలో 8,70,694(50.19 శాతం) మహిళలు ఉన్నారు. కల్వకుర్తి, కొల్లాపూర్ మినహా మిగతా 5 సెగ్మెంట్లలో మహిళలు అధికంగా ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం అల్లాడుతున్నారు. భరించలేని ఉక్కపోత ఉబ్బరంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం నమోదైన ఎండవేడికి తారురోడ్డు కూడా సెగలు కక్కింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి, ఇటిక్యాలలో 43.8, కేటీదొడ్డిలో 43.1, అలంపూర్లో 42.5, ధరూర్ లో 42.3, అయిజలో 42.1, గద్వాలలో 42, ఉండవెల్లిలో 41.1, గట్టులో 40.7, మల్దకల్లో 40.5, మానవపాడు, రాజోలిలో 40.3 డిగ్రీలు నమోదైంది.
Sorry, no posts matched your criteria.