India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 36.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 36.1 మి.మీ, గద్వాల జిల్లా కల్లూరు తిమోన్ దొడ్డి 36.0 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 35.5 మి.మీ, వనపర్తి జిల్లా అమరచింతలో 34.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బల్మూర్ మండలంలోని జినుకుంట శివారులో ఈ తెల్లవారుజామున యువజంట బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహేష్ ఇటీవల అదే గ్రామానికి చెందిన భానుమతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తిరగక ముందే కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కాని శనివారం రాత్రి వారి వ్యవసాయ పొలంలో ఉన్న చెట్టుకు ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఉమ్మడి MBNR జిల్లాలో నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 25,263 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకు 71 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 నుంచి మ.1 గంట వరకు పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉ.9 గంటల లోపు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.10 గంటల వరకు అనుమతించి బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గేట్లు మూసివేసి అభ్యర్థులను అనుమతించరని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రివర్గంలో DK అరుణకు చోటు దక్కుతుందని పాలమూరు జిల్లా వాసుల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు దక్కవచ్చని, మహిళా కోటలో డీకే అరుణకు మోదీ కేబినెట్‌లో మంత్రిగా బెర్త్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన అనుభవం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనే నాయకురాలిగా గుర్తింపు వంటి అంశాలు ఆమెకు కలిసొస్తాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మూడురోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జూరాల జలాశయంలోకి ప్రవాహం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 3,300 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. జలాశయంలో నీటినిల్వ 1.637 టీఎంసీలకు పెరిగింది. వరద మరో రెండురోజుల పాటు నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు కర్ణాటకలోని నారాయణ్‌పూర్ ప్రాజెక్టులోకి 12,500 క్యూసెక్కులు, ఆల్లమట్టిలకి 2,500 క్కూసెక్కుల ప్రవాహం చేరుతున్నట్లు అధికారులు వివరించారు.

నేడు జరగనున్న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 15,199 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులను 8:30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అంటే ఉదయం 10 గంటలకే గేట్లు మూసి వేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.

సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని పట్టణవాసులు కమలం పార్టీకే జైకొడితే.. పల్లెల్లో మాత్రం కాంగ్రెస్ ది పైచేయి అయింది. పూర్వ మహబూబ్‌నగర్‌లో పురపాలికలు మొత్తం 23 ఉన్నాయి. వీటి పరిధిలో BJPకి 2,07,202 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,92,620, BRSకు 48,617 ఓట్లు వచ్చాయి. పట్టణాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి 14,582 ఓట్లు అత్యధికంగా వచ్చాయి. NGKL లోక్ సభ స్థానం పరిధి గ్రామాల్లో BRS, BJPకి పోటాపోటీగా ఓట్లు పడ్డాయి.

సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని పట్టణవాసులు కమలం పార్టీకే జైకొడితే.. పల్లెల్లో మాత్రం కాంగ్రెస్ ది పైచేయి అయింది. పూర్వ మహబూబ్‌నగర్‌లో పురపాలికలు మొత్తం 23 ఉన్నాయి. వీటి పరిధిలో BJPకి 2,07,202 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,92,620, BRSకు 48,617 ఓట్లు వచ్చాయి. పట్టణాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి 14,582 ఓట్లు అత్యధికంగా వచ్చాయి. NGKL లోక్ సభ స్థానం పరిధి గ్రామాల్లో BRS, BJPకి పోటాపోటీగా ఓట్లు పడ్డాయి.

ఉమ్మడి జిల్లాలోని పలు డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లను బదిలీ చేస్తూ రీజనల్ మేనేజర్ శ్రీదేవి ఆదేశాలతో శుక్రవారం పీఓ ఉత్తర్వులు జారీ చేశారు. పేట5, గద్వాల3, NGKL 2, కోస్గి, వనపర్తి, కల్వకుర్తి, షాద్నగర్ డిపోల నుంచి ఒక్కొక్కరు చొప్పున 14మంది డ్రైవర్లు, పేట 4, గద్వాల 3, కల్వకుర్తి 2, కొల్లాపూర్ 2, షాద్నగర్, వనపర్తి నుంచి ఒకరు చొప్పున 13మంది కండక్టర్లను ఇతర డిపోలకు కేటాయించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎట్టకేలకు గృహజ్యోతి పథకం(జీరో బిల్లు) అమల్లోకి వచ్చింది. గత మార్చిలోనే గృహజ్యోతి పథకం అమలు కావాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల కోడ్‌తో పథకం అమలు నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారులు 3 నెలలపాటు విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ వచ్చారు. అధికారులు 2 రోజుల నుంచి జీరో బిల్లులను జారీ చేస్తున్నారు. జిల్లాలో 2.65లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది.
Sorry, no posts matched your criteria.