India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆన్‌లైన్‌లో పరిచయమై ఓ వ్యక్తిని నమ్మించి తన ఖాతాలోంచి రూ.36 లక్షలు ఖాళీ చేసిన ఘటన జడ్చర్లలో చోటుచేసుకుంది. SI చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన సునీల్ జవహర్‌కు ఆన్‌లైన్‌లో గుర్తుతెలియని వ్యక్తి పరిచయం కాగా.. గూగుల్ వ్యూస్స్ ఇస్తే డబ్బులు వస్తాయని దీని కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పిన అతను సునీల్ ఖాతా నుంచి రూ.36 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో బాలిక అదృశ్యంపై కేసు నమోదైంది. ఎస్సై చంద్రమోహన్ వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) ఇంట్లో చెప్పకుండా ఈనెల 7న వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. MBNR పార్లమెంట్ పరిధిలో బీజేపీకి NRPT, మక్తల్లోనే మంచి మెజార్టీ వస్తుందని భావిస్తున్న తరుణంలో నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగపాండురెడ్డి, జలంధర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ అలీ తమ రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి గురువారం అందజేశారు.
ఉప్పునుంతల మండలం కంసానిపల్లిలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో దాదాపు 17 మంది ఉపాధి కూలీలు గాయాలయ్యాయి. ఘటనలో బాధితురాలు పద్మ ఫిర్యాదుతో ట్రాక్టర్ డ్రైవర్ ఆంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగిందన్నారు. ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఆస్పత్రికి వెళ్లి క్షత్రగాత్రులకు వైద్య సేవలందించారు. గాయపడిన కూలీలను మాజీ ఎమ్మెల్యే గువ్వల పరామర్శించారు.
✒ఉమ్మడి జిల్లాలో పోలింగ్ పెంచేందుకు అధికారుల ఫోకస్
✒నేడు పలువురు CONGRESS, BJPలో చేరికలు
✒గ్రామాల్లో నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు
✒పలు నియోజకవర్గంలో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✒ఉమ్మడి జిల్లాలో ముమ్మురంగా వాహనాల తనిఖీలు
✒పలు చోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✒ఉపాధి హామీ పనులపై అధికారుల దృష్టి
✒కోయిలకొండ: నేడు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
✒గ్రూప్స్,DSC పై ఉచిత శిక్షణ
ఉమ్మడి జిల్లాలో మద్యం ప్రియులు తెగ తాగేస్తున్నారు. ఒక్క మార్చిలోనే గతేడాదికి సమానంగా అమ్మకాలు సాగాయి. 2023లో మార్చిలో రూ.276.82కోట్లు, ఈ మార్చిలోనూ రూ.245కోట్ల వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఉమ్మడి జిల్లాలో 261 మద్యం దుకాణాలు ఉన్నాయి. గతేడాది మార్చిలో 2,66,400కాటన్ల మద్యం, 4,53,100 కార్టన్ల బీర్ల.. ఈఏడాదిలో ఇప్పటివరకు 7,92,326 కార్టన్ల లిక్కర్, 11,40,330 కార్టన్ల బీర్లు అమ్ముడుపోయాయి.
ఈనెల 16న పాలమూరు విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా. నాగం కుమారస్వామి తెలిపారు. వర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, భారత రత్న డా. బీఆర్. అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా పులే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహబూబ్ నగర్: ఓటు నమోదు, మార్పులు చేర్పులకు ఈనెల 15వ తేదీ వరకు సమయం ఉందని ఉమ్మడి జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. 2006 మార్చి 31లోపు జన్మించిన వారంతా ఓటు హక్కు పొందేందుకు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తలు.. నాగర్‌కర్నూలు–వాల్యానాయక్, గద్వాల–ఇంతియాజ్ అహ్మద్, అలంపూర్–దేవరమల్లప్ప, కల్వకుర్తి–చాడా కిషన్‌రెడ్డి, వనపర్తి–బైకాని శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేట – నవీన్‌కుమార్‌రెడ్డి, కొల్లాపూర్ – డాక్టర్ ఆంజనేయులు గౌడ్ నియమించారు.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నారాయణపేట జిల్లాలో BJPకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలోని ముగ్గురు కీలక నేతలు ఒకే రోజు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షునిగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న పాండు రెడ్డి, మక్తల్ అభ్యర్థిగా పోటీలో ఉన్న జలంధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా ఉన్న రఘురాం రెడ్డి ఈరోజు BJPకి రాజీనామా చేశారు.
Sorry, no posts matched your criteria.