India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వనపర్తి జిల్లాలో రాజపేట సమీపంలో జరిగిన <<13027779>>రోడ్డు ప్రమాదంలో ఇద్దరు<<>> ఉద్యోగులు చనిపోయారు. జడ్చర్ల మండలం అలూరుకు రవికమార్, MBNR జిల్లా ధర్మాపూర్‌కు చెందిన వెంకటయ్య మిత్రులు. గద్వాల పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్‌గా చేస్తున్న రవి.. వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్‌గా పనిచేస్తున్న వెంకటయ్యతో కలిసి బైక్ పై MBNR వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజపేట శివారులో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
ఉమ్మడి జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. తాగునీటికి ఇబ్బందులు ఉన్న పట్టణాలు, గ్రామాలు, ఆవాసాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలను వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే మరమ్మతులకు గురైన బోరు బావులు, చేతిపంపులు యుద్ధప్రతిపాదికన బాగు చేయించాలని సూచిస్తున్నారు.
SC సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మూడు నెలలపాటు ఫౌండేషన్ కోర్సుపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ జిల్లా అధికారి పాండు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 12వ తేదీలోగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
✏ఏర్పాట్లు పూర్తి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు
✏MBNR:నేడు ఏర్పాట్లు.. రేపు అథ్లెటిక్స్ ఎంపికలు
✏కొనసాగుతున్న ఇంకుడు గుంతల సర్వే
✏పలుచోట్ల తాగునీటి సమస్యలపై హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు
✏ఈద్గాల వద్ద భారీ బందోబస్తు
✏బాలానగర్:నేటి నుంచి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభం
✏రంజాన్ వేడుకల్లో పాల్గొననున్న స్థానిక MLAలు,నేతలు
✏తిమ్మాజీపేట:నేటి నుంచి వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాలు
ఈనెల 13న రెండో శనివారం పాఠశాలలకు సెలవు లేదని NGKL, WNPT జిల్లాల డీఈవో డా.గోవిందరాజులు తెలిపారు. ప్రతి నెలలో రెండో శనివారం సెలవు ఉంటుండగా ఈ నెలలో రెండో శనివారం పాఠశాలలకు పని దినమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు పనిచేసేలా సంబంధిత ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ ఐదేళ్లలో(10.67 శాతం) 3,27,451 మంది ఓటర్లు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి MBNR లోక్‌సభ పరిధిలో 16,80,417, నాగర్‌కర్నూల్ పరిధిలో 17,37,773కు ఓటర్ల సంఖ్యం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 68వేల ఓట్లు నమోదుయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో 18-39 ఏళ్ల మధ్య ఓటర్లు 52 శాతం ఉన్నారు. ఈ ఐదేళ్లలో 701 కేంద్రాలు పెరిగాయి.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాల్లో వ్యాపార కేంద్రాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ముస్లింలు పగలంతా ధ్యానంలో గడుపుతారని భావించిన వ్యాపారులు.. అర్ధ రాత్రి వరకు షాపులను తెరిచి ఉంచుతున్నారు. వస్త్రాలు,మెహందీ, మిస్వాక్, ఇత్తర్ (సుగంధ ద్రవ్యాలు), సుర్మా, గృహ పరికరాలతో పాటు సేమియాలు, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల్లో సందడి నెలకొంది.
బీజేపీ అభ్యర్థి అరుణమ్మ దొరసానే ఆమెకు మొదటి నుండి వెన్నుపోటు రాజకీయాలు చేయడం నర నరాల్లో ఉందని పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మక్తల్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. డీకే అరుణ వెన్నుపోటు రాజకీయాన్ని మీ సొంత తండ్రి గుర్తించారని తెలిపారు. నువ్వు ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది.MBNR,NGKL పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని, క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలైన BJP,BRSకు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అభ్యర్థులు వంశీచందర్ రెడ్డి,మల్లు రవి స్థానిక ఎమ్మెల్యేలు,నాయకులతో ప్రచారంలో నిమగ్నమయ్యారు.ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతలకు పలు సూచనలు చేశారు. మీ కామెంట్?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమ్మర్ సీజన్ హీటెక్కిస్తోంది. వేడిగాలులు ఉక్కిరి ప్రతి ఒక్కరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోతతో విసిగిపోతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈసారి ఎండలు దంచికొడుతుండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.