India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డుకు వరుసగా మొత్తం 6 రోజుల పాటు మార్కెట్‌కు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం ధాన్యం, ఉల్లి సీజన్ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడకుండా సెలవుల జాబితా విడుదల చేసినట్లు మార్కెట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం అమావాస్య, మంగళవారం ఉగాది, బుధవారం కరి పండుగ, గురువారం, శుక్రవారం రంజాన్ సెలవులు ఉంటాయన్నారు. తిరిగి శనివారం ఒక్కరోజు లావాదేవీలు జరుగుతాయని చెప్పారు.
✏GDWL,NRPT&NGKL: పలు గ్రామాల్లో కరెంట్ కట్
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(సోమ)-6:38,సహార్(మంగళ)-4:44
✏నేడు లోక్‌సభ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ
✏నేడు పాలమూరుకు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ రాక
✏ఇఫ్తార్ విందు.. హాజరుకానున్న ప్రముఖులు
✏పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✏ఉట్కూరు:నేటి నుంచి కాళికామాత జాతర ప్రారంభం
✏దేవరకద్ర:మార్కెట్ యార్డ్ కు వారం రోజులపాటు సెలవు
✏ఎలక్షన్ ఎఫెక్ట్.. పలుచోట్ల తనిఖీలు
రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఆదివారం అమరచింతలో డీఎంఆర్ఎం ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి స్వగృహంలో ‘ఇఫ్తార్ విందు’ ఇచ్చారు. ఇందులో MBNR కాంగ్రెస్, BJP ఎంపీ అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు పలకరించుకున్నారు. వీరితో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి, BJP రాష్ట్ర నాయకుడు కొండయ్య పాల్గొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ ధర రూ.294 పలుకుతోంది. వారంలోనే ఏకంగా రూ.50 పెరగడంతో మధ్య తరగతి వాళ్లు కొనేందుకు వెనకాడుతున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతకు కోళ్లు చనిపోతుంటాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్ నేపథ్యంలో హరీస్ తయారీకి ఎక్కువగా చికెన్ వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. చికెన్ రూ.350వరకు పెరిగే అవకాశం ఉంది. కోళ్ల ఎగుమతిలో రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు మొదటి స్థానంలో ఉంది.
డా. బీఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2017 సంవత్సరానికి ముందు డిగ్రీలో చేరిన విద్యార్థులు, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు
బ్యాక్ లాక్ పరీక్షల ఫీజు ఈ నెల 26వ తేదీ వరకు చెల్లించాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణగౌడ్ తెలిపారు. విద్యార్థులు తమ సమీప ఆన్లైన్ కేంద్రాల్లో పేపరుకు రూ.150 చొప్పున చెల్లించాలని అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4321 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో అయిదేళ్లలోపు చిన్నారులు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ 30 వరకు 65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లు, సహాయకులు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 550 మందికి పైగా పదవీ విరమణ పొందనున్నారు. ఈ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష, సహాయకులకు రూ.50వేలు చెల్లించనున్నారు.
మహబూబ్ నగర్ పట్టణం శివారులో బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలలో కొందరు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు పోలీసు అధికారుల సహకారంతో జేసిబిలతో తొలగించారు. సర్వేనెంబర్ 25లో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టగా అధికారులు పలుమార్లు హెచ్చరించిన వినకపోవడంతో నేడు అక్రమాలను కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరికి రక్త పోటు(BP) లేదా మధుమేహంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ రెండు జబ్బుల బారినపడి వారు MBNR జిల్లాలో 89,387 మంది, NGKL జిల్లాలో 68,574, NRPT జిల్లాలో 54,232, జోగులాంబ గద్వాల జిల్లాలో 52,265, వనపర్తి జిల్లాలో 42,448 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మూత్రపిండాలు దెబ్బతిని ప్రతినెలా డయాలసిస్(రక్తశుద్ధి) చేయించుకుంటున్న బాధితులు 1,242 మంది ఉన్నారు.
♥రేపు కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి,NGKLకు మాజీమంత్రి కేటీఆర్ రాక
♥ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ‘ఎత్తెకాఫ్’ కార్యక్రమాలు
♥MBNR:గన్‌తో కాల్చుకొని AR SI బలేశ్వర్ సూసైడ్
♥ACMP:భార్యాభర్తల మధ్య గొడవ..భర్త మృతి
♥రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన:RSP
♥పెరుగుతున్న ఎండలు..అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్లు
♥గ్రూప్స్&DSC పై ఉచిత శిక్షణ:BC,SC స్టడీ సర్కిల్
♥ఇఫ్తార్ విందు..పాల్గొన్న స్థానిక MLAలు
√ రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన:RSP.
√బొంరాస్ పేట: ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి:విమలక్క.
√ అచ్చంపేట: భార్యాభర్తల మధ్య గొడవ.. పెట్రోల్ పోసుకొని భర్త ఆత్మహత్య.
√ రేపు కొడంగల్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
√ మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జోరుగా ఎన్నికల ప్రచారాలు.
√ ఇఫ్తార్ విందులో పాల్గొన్న పలువురు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
Sorry, no posts matched your criteria.