India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశము నిర్వహించారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ గెలుపు తదితర విషయాలను చర్చించామన్నారు. రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు. భారీ బహిరంగ సభకు సోనియాగాంధీని రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలియజేశారు.
పెబ్బేరు మార్కెట్ యార్డులో జరిగిన ప్రమాదంలో రూ.కోట్ల విలువైన గన్నీ బ్యాగులు తగలబడిన వ్యవహారంలో ఇంటి దొంగల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి గురైన గోదాం రెండో కంపార్ట్‌మెంట్‌లోని ఒక కిటికీ ప్రమాదం జరిగిన సమయంలో ఎలా తెరుచుకుని ఉందనే విషయంలో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇనుప కిటికీలు బయట నుంచి తెరవడం అసాధ్యమని ఘటనా స్థలాన్ని సందర్శించిన అధికారులు అంటున్నారు.
NRPT: ట్రాక్టర్, సిమెంట్ ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్ సమీపంలో జరిగింది. నారాయణపేట జిల్లాకి చెందిన డప్పు బాలప్ప ట్రాక్టరులో తాండూర్ వెళ్తుండగా యాలాల్ శివారులో సిమెంట్ ట్యాంకర్ ఢీకొంది. తీవ్ర గాయాలైన బాలప్పను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నారాయణపేట జిల్లా వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 22 సీనియర్ రెసిడెంట్, 3 ఎకనామీ, 2 ఫిజియాలజీ, 2 బయో కెమిస్ట్రీ ట్యూటర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఏప్రిల్ 6 న ఉదయం 9 గంటలకు వైద్య కళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనాలని, వివరాలకు https://narayanpet.telagana.gov.in లో చూడాలన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి నవాబ్ పేట మండల కేంద్రానికి మార్గ మధ్యంలో 9 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో వెలసిన పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచినది. కొత్త వాహనం తెచ్చినా, ఎన్నికల ప్రచారాలు ఈ ఆలయం నుండి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీ. ఆది, మంగళవారాలు వేల సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని దర్శించుకుని బోనాలు సమర్పిస్తారు.
తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ఎన్నికల కమిషన్ అనుమతితో మంజూరు చేయాలని, ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సాధారణ బదిలీలను చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. రోజురోజుకూ నీటి ఎద్దడి తీవ్రం అవుతోంది. అయితే జలసంరక్షణ చర్యలు లేకపోవడంతోపాటు తాగునీటిని విచ్చలవిడిగా వాడటం, పచ్చదనాన్ని దెబ్బతీయడం, వాల్టా చట్టం అమలు చేయకపోవడం ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి పాలమూరు ప్రజలు చాలా నేర్చుకోవాలని.. నీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే బెంగళూరు మాదిరిగా నీటి కటకట రానుందని హెచ్చరించిస్తున్నారు.
బైక్ అదుపుతప్పడంతో కిందపడి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన బిజినేపల్లి మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం జరిగింది. ఎస్సై నాగశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. నాగనులు గ్రామానికి చెందిన కృష్ణయ్య(65) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై పాలెం నుంచి గ్రామానికి వెళ్తున్నాడు. ఈక్రమంలో మార్గ మధ్యలో అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.
రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ ఛైర్మన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బాద్మీ శివకుమార్, తదితర నేతలు గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న శివకుమార్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు పాటు మరికొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.
నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ శివకుమార్ రెడ్డి తండ్రి, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి తాత పుల్లారెడ్డి దశదిన కర్మ కార్యక్రమం గురువారం హైదరాబాద్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు హాజరై పుల్లారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Sorry, no posts matched your criteria.