India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన 2023-24 ఏడాది టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. ఇందులో WNPT, NGKL జిల్లాకు చెందిన 637 మంది ఉపాద్యాయులు పాల్గొన్నారు. ప్రతి టీచర్ ఒక రోజు 40 పేపర్లు వాల్యుయేషన్ చేశారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగిన వాల్యుయేషన్‌లో జిల్లాకు వచ్చిన 1,53,336 పేపర్లను దిద్ది విద్యార్థులు సాధించిన మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని గ్రామాలు, పట్టణాలలో నిరంతరం పర్యవేక్షించి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం వెబెక్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. SDF ద్వారా మంజూరు చేసిన త్రాగునీటి సంబంధిత బోర్ వెల్ లు, మోటర్ లు, పైప్ లైన్ పనులు ప్రగతిలో ఉన్న పనులన్నీ వారం రోజులలో పూర్తి చేయాలని తెలిపారు.
✏ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ:CM రేవంత్ రెడ్డి
✏KCR కట్టిన సెక్రటేరియట్‌లో కూర్చోకండి: నిరంజన్ రెడ్డి
✏MP ఎన్నికల్లో పాలమూరులో గులాబీ జెండా ఎగరాలి: హరీష్ రావు
✏కాంగ్రెస్‌కి 3,4 సీట్లు మాత్రమే వస్తాయి:మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
✏రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న BJPనేతలు
✏ఉమ్మడి జిల్లాలో పగలు సెగలు..రాత్రి చల్ల గాలులు
✏అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం:వంశీ చంద్ రెడ్డి
NRPT:ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ జెండాను వదల్లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జన జాతర సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ జెండా వదలలేరని,కాంగ్రెస్ పార్టీ పేదలకు, బీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించింది. వెనుకబడిన సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్‌కు మించింది లేదు” అని రేవంత్ రెడ్డి అన్నారు.
NRPT:ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ‘జనజాతర సభ’లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించాం. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులివ్వాలి. వారికి న్యాయం చేసేందుకే బీసీ కులగణనకు తీర్మానం చేశాం” అని అన్నారు.
పాలమూరు పక్కనే కృష్ణా నది ఉన్నా.. గత బీఆర్ఎస్ పాలనలో మనకు చుక్క నీరు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట సభలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో లక్ష 30వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని అన్నారు. వికారాబాద్-కృష్ణ రైల్వే లైన్‌ను ఆనాడు కాంగ్రెస్ కేటాయించిందని.. కానీ BRS, బీజేపీ పార్టీలు కుట్ర చేసి ఆపాయన్నారు. బీఆర్ఎస్ చిత్రహింసలు పెట్టినా.. తమ కార్యకర్తలు కాంగ్రెస్ జెండాను వీడలేదని అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటేకాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన జన జాతర సభలో మాట్లాడారు. నారాయణపేట బిడ్డ అంటున్న డీకే అరుణ నారాయణపేటకు అదనంగా నిధులు తీసుకొచ్చినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేసిన వ్యక్తి డీకే అరుణ అని ఆరోపించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లిలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరులో 41.4, మహబూబ్నగర్ జిల్లా సల్కార్పేట్ లో 41.4, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 41.0, నారాయణపేట జిల్లా ధన్వాడలో 40.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇటీవల BJPకి రాజీనామా చేసిన నాయకులతోపాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టచ్‌లో ఉన్న BRS నాయకులు కూడా పలువురు నేడు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే జన జాతర సభలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో అందరూ చేరుతారా? లేక ఒకరిద్దరు మాత్రమే పార్టీ కండువా కప్పుకుంటారా..? అనేది తేలాల్సి ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని చెప్పొచ్చు.
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నారాయణపేటలో జరిగే జన జాతర సభలో పాల్గొననున్నారు. మరి కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సభ ప్రాంగణానికి సీఎం చేరుకోనున్నారు. సభ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు వెళ్తారని తెలుస్తోంది. కాగా పాలమూరు సొంత జిల్లా కావడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.