India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నారాయణపేటకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు రథంగ్ పాండు రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. కాగ ఆయన తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు. ఈయనతో పాటు రాజీనామా చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిమూద్ అలీ వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సోమవారం డీకే అరుణతోపాటు కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో పగటి వేళ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు అటు ఇటుగా ఉంటోంది. సాయంత్రం వాతావరణం చల్లబడి, రాత్రి వేళల్లో చల్లగాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో గత 4 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు మాత్రమే నమోదు కాగా.. ఆదివారం జిల్లాలోని గండీడ్ మండలంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒక్కరోజులోనే 1.4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో ఎండ ప్రభావం ఎక్కువగా కనిపించింది.
గద్వాల పాత హౌసింగ్ బోర్డ్ సమీపంలో నిన్న జరిగిన <<13050560>>రైలు ప్రమాదం<<>>లో మృతి చెందిన మహిళ గుంటూరు జిల్లా మంతెనవారి పాలెం వేముల ప్రియాంకగా గుర్తించారు. ఉద్యోగరీత్యా భర్త జితేంద్రతో కలిసి జడ్చర్లలో ఉంటున్నారు. ఇటీవల భర్త తిరుపతికి వెళ్లగా ఆమె వారి బంధువులను చూసేందుకు గుంటూరు వెళ్లింది. తిరిగి జడ్చర్లకు వస్తుండగా గద్వాల వద్ద రైలు నుంచి కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
బాలికను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. పాన్‌గల్ SI వేణు వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను వనపర్తి మం. వశ్యనాయక్ తండాకు చెందిన శివ ప్రేమిస్తున్నాడు. గుట్టు చప్పుడుకాకుండా ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు SI చెప్పారు.
✔NRPT:నేటి జన జాతర సభకు సర్వం సిద్ధం.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
✔నేడు PUలో జాబ్ మేళా
✔లింగాల: నేటి నుంచి కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు
✔MBNR: నేడు ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సదస్సు
✔ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి వార్షిక పరీక్షలు
✔ఉట్కూరు: నేడు ఉచిత మెగా వైద్య శిబిరం
✔WNPT,GDWL: నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
✔నేడు కోస్గికు రానున్న మాజీ మంత్రి హరీష్ రావు
✔తాగునీటి సమస్యలపై అధికారుల ఫోకస్
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు,కేజీబీవీలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు,సీబీఎస్ఈ, మైనార్టీ గురుకుల, ఆదర్శ, మహాత్మ జ్యోతి బాపులే పాఠశాలల్లో సోమవారం నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 23న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి, విద్యార్థుల పురోగతి కార్డులను అందించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
హైదరాబాద్ దివీస్ ల్యాబ్స్ సంస్థలో ట్రైనీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఈనెల 15న పాలమూరు విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. చంద్రకిరణ్ తెలిపారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఎం-ఫార్మసీ, బీ-ఫార్మసీ, నాల్గో సెమిస్టర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నేడు నారాయణపేటలో సీఎం రేవంత్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు SPలు, ఐదుగురు DSPలు, 25 మంది CIలు, 65 మంది SIలు, 75మంది హెడ్ కానిస్టేబులు, 415 మంది కానిస్టేబుళ్లు, గార్డులు, 50 మంది మహిళా పోలీసులు, రెండు రోప్ పార్టీలు, రెండు టీఎస్ఎస్పీ ప్లాటున్స్ , స్పెషల్ పార్టీ పోలీసులు, రెండు ఐటీబీపీ ప్లాటూన్స్‌లతో పోలీసు అధికారులు, సిబ్బంది పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 4 గంటలకు నారాయణపేట వస్తున్నట్లు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తెలిపారు. సీఎం హోదాలో జిల్లాకు రేవంత్ 2వసారి వస్తున్నారు. ఈ సభకు నారాయణపేట నియోజకవర్గం నుంచి భారీఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం వ్యవధిలోనే మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలో రెండోసారి రేవంత్ రెడ్డి రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.