Mahbubnagar

News April 14, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✏ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు
✏CONGRESS,BJPలో భారీ చేరికలు
✏బీజేపీ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు:మల్లురవి
✏విద్యతోనే పేదరికాన్ని జయించాలి: మంత్రి జూపల్లి
✏NRPT:CM రేవంత్ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
✏GDWL:రైలు ఢీకొని మహిళ మృతి
✏ఉమ్మడి పాలమూరులో ‘SUMMER CRICKET’
✏నూతన ఓటు హక్కును నమోదు చేసుకోండి:EC
✏రేపు కోస్గి‌కి మాజీ మంత్రి హరీశ్ రావు రాక

News April 14, 2024

MBNR: కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయి?: మాజీ మంత్రి

image

ముగ్గురు అభ్యర్థుల్లో స్థానికుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి అని, పిలిస్తే పలికే నాయకుడని ఎంపీ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయని, బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ల ముందు ఉందని, ప్రతి ఒక్కరూ మరో సారి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి‌ని గెలిపించాలని కోరారు.

News April 14, 2024

MBNR: డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరికలు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, నాయకులు ఆదివారం మాజీ మంత్రి డీకే అరుణ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ.. 3వ సారి నరేంద్ర మోడీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2024

తెలంగాణలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి: మాజీ ఎమ్మెల్యే

image

భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. బోనస్ ఇస్తా అని మద్దతు ధర కూడా రైతులకు ఇవ్వట్లేదని అన్నారు. తెచ్చిన తెలంగాణ‌ను అభివృద్ధి చేసుకున్నాం, నాలుగు నెలల్లోనే తెలంగాణ‌లో కరువు ఛాయలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

News April 14, 2024

MBNR: బీఆర్ఎస్‌కు సవాల్‌‌గా మారిన MP ఎన్నికలు

image

బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. సత్తా చాటేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి MBNRలో ఉన్న 2 స్థానాలకు అభ్యర్థులను రంగంలోకి దింపిన పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఓ వైపు మన్నె శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు RSPవిస్తృతంగా‌ ప్రచారం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌, బీజేపీలోనూ బలమైన అభ్యర్థులు నిలవడం‌తో BRSసర్వశక్తులూ ఒడ్డుతోంది. దీనిపై మీ కామెంట్?

News April 14, 2024

పాలమూరులో విమర్శల వార్

image

పాలమూరులోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి మొదలైంది. BRS, కాంగ్రెస్‌, BJP అభ్యర్థులు మాటలతూటాలు పేలుస్తున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలకు తెరలేపారు.10ఏళ్లలో పాలమూరుకు హోదా ఎందుకు తేలేదని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం 6గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. 10ఏళ్ల క్రితం.. పాలమూరు ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా మారిందో గమనించాలని బీఆర్ఎస్ అంటోంది.

News April 14, 2024

గద్వాల: రైలు ఢీకొని మహిళ మృతి

image

గద్వాలలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోనున్న ఫాతిమా మజీద్ వద్ద గుర్తుతెలియని రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ప్రమాదాన్ని గుర్తించిన కాలనీవాసులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగినట్లు పేర్కొన్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 14, 2024

ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు

image

అర్హులైన యువతీ,యువకులు ఓటుహక్కు పొందడం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని ఆర్డీవో మాధవి తెలిపారు. అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని,గ్రామ స్థాయిలో బీఎల్వో, మండల స్థాయిలో తహసీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాల్లో గడువులోగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో కూడా పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు

News April 14, 2024

MBNR: 17 మండలాల్లో ప్రమాద ఘంటికలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండల తీవ్రతతో రోజురోజుకు భూగర్భజలాలు పాతాళానికి పడిపోతున్నాయి. దీంతో వరి పొలాలు, కూరగాయలు నీరు అందక ఎండిపోతున్నాయి. 17 మండలాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. వెల్దండ, ధరూర్, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, ధన్వాడ,హన్వాడ, గండీడ్, మానవపాడు, కేటిదొడ్డి, నవాబుపేట, గుండుమాల్, కల్వకుర్తి, కోయిలకొండ, కొత్తకోట, NGKL, మదనాపూర్ మండలాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని రాజేంద్ర కుమార్ తెలిపారు.

News April 14, 2024

ఉమ్మడి పాలమూరులో ‘SUMMER CRICKET’

image

క్రికెట్ ప్లేయర్లకు HCA శుభవార్త చెప్పింది. ఈనెల 20న ఉమ్మడి పాలమూరులో సమ్మర్ క్యాంప్ మొదలుపెడుతామని సంస్థ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. ఉచితంగానే ఈ క్యాంప్ కొనసాగిస్తామన్నారు. ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివరాలు: MBNR:9440057849, GDWL:9885955633, NGKL:9885401701.
SHARE IT