India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చైత్రమాసం వసంత రుతువు, ఏప్రిల్ 22 పౌర్ణమి నాడు తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం MBNR ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడప నున్నట్లు డిపో మేనేజర్ సుజాత శనివారం తెలిపారు. ఈనెల 21 సాయంత్రం 5 గంటలకు MBNR డిపో నుండి బస్సు బయలుదేరి ఏపీలోని కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, 22న సాయంత్రం అరుణాచలం చేరుకుంటుందన్నారు. 94411 62588, 73828 27102 సంప్రదించాలన్నారు.
పాలమూరు ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం లోని వివిధ మండలాలలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తో కలిసి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు.
నరేంద్ర మోదీని తెలంగాణ ప్రజలు గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం కొత్తకోట మండల కేంద్రంలో, మదనాపురం, అడ్డాకల్ మండలాల బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్ముకుంటే ప్రజలు మోసపోతారని ధ్వజమెత్తారు.
నారాయణపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ హరినారాయణ్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్తతో వచ్చిన విభేదాల కారణంగా బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
మక్తల్ నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జలందర్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. 2 సార్లు మక్తల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జలందర్ రెడ్డి నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్ ఏర్పాటు చేసుకొని బలమైన నేతగా ఉన్న ఆయన పార్టీ మారడం బీజేపికి దెబ్బె అని పలువురు అంటున్నారు. వంశీచంద్ రెడ్డి, జితెందర్ రెడ్డి పాల్గొన్నారు.
మద్యం తాగొద్దన్నందుకు ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI రాజశేఖర్ వివరాలు.. చారకొండ మండలం నూకలచింతవాడిక తండాకు చెందిన కేతవత్ లచ్చిరామ్‌నాయక్(62) మద్యానికి బానిసయ్యాడు. తరుచు ఇంట్లో గొడవ పడుతుండగా మందు తాగొద్దని కుటుంబీకులు వారించారు. దీంతో నిన్న ఉదయం పొలం వద్ద లచ్చిరామ్ పురుగు మందు తాగగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందాడు. ఈమేరకు కొడుకు శివలాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద విధానాలను కలిసికట్టుగా తిప్పి కొట్టాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశినాథ్ అన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాలులో నిర్వహించిన జిల్లా సదస్సులో పాల్గొని మాట్లాడారు. కేంద్రం మతాల మధ్య చిచ్చులు పెట్టి ఘర్షణలు సృష్టిస్తోందని అన్నారు. కార్పోరేట్ సంస్థలకు దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నారని అన్నారు.
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి 1984లో పోటీ చేసిన సూదిని జైపాల్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారిగా ఎన్నికయ్యారు. 1998లో జనతాదళ్ (సెక్యులర్) తరఫున మహబూబ్‌నగర్ ఎంపీగా రెండో సారి ఆయన ఎన్నికయ్యారు. అదే ఏడాది ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి దక్షిణ భారత ఎంపీ జైపాల్ రెడ్డి కావడం విశేషం. పలు మార్లు కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి పనిచేశారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఈనెల 16న జరగాల్సిన ఎంఈడీ పరీక్షను రీషెడ్యూల్ చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. మహనీయుల జయంతి నేపథ్యంలో 16న జరిగే ఎంఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష 26న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు ఉంటుందని విద్యార్థులు గమనించాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, ఉప్పునుంతల, తిమ్మాజీపేట, రాజాపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఉప్పునుంతల మండలం తాడూర్ వాసి గుండేమోని శ్యామలమ్మ పొలం వద్ద పిడుగుపాటుతో స్పాట్లోనే మృతి చెందింది. తాడూరు మండలం ఐతోలులో తోడికోడళ్లు ఆసియా బేగం, అలియా బేగం కరెంట్ షాక్‌తో చనిపోయారు.
Sorry, no posts matched your criteria.