Mahbubnagar

News April 10, 2024

పాలమూరులో హీటెక్కిస్తున్న సమ్మర్ సీజన్.!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమ్మర్ సీజన్ హీటెక్కిస్తోంది. వేడిగాలులు ఉక్కిరి ప్రతి ఒక్కరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోతతో విసిగిపోతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈసారి ఎండలు దంచికొడుతుండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News April 10, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి.. రేపే రంజాన్ పండుగ
♥దేవరకద్ర:ప్రాణం తీసిన ఈత సరదా..ఇద్దరు యువకులు మృతి
♥WNPT:రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
♥షాద్‌నగర్‌లో యాక్సిడెంట్..వ్యక్తి మృతి
♥దౌల్తాబాద్:చిరుతను చంపిన కేసులో నిందితులు అరెస్ట్
♥కాంట్రాక్టర్ల కోసం,పదవుల కోసం BJPలో చేరలేదు:DK అరుణ
♥కాంగ్రెస్,BJPలో పలువురు చేరిక
♥NRPT:8.85 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం
♥’ఇఫ్తార్ విందు’లో హాజరైన నేతలు

News April 10, 2024

వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ రూ.2,14,500 సీజ్: ఎస్పీ రితిరాజ్

image

లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలోని బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు రూ.2, 14, 500 సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీ కి అప్పగించినట్లు గద్వాల ఎస్పీ రితిరాజ్ తెలిపారు. బుధవారం నందిన్నె బార్డర్ చెక్ పోస్ట్ వద్ద రూ. 60,000, రాజోలి సుంకేసుల చెక్ పోస్ట్ వద్ద రూ.1,0000, గట్టు చెక్ పోస్ట్ వద్ద రూ. 54, 500 పట్టుబడినట్టు తెలిపారు.

News April 10, 2024

దేవరకద్ర: ప్రాణం తీసిన ఈత సరదా.. ఇద్దరు యువకులు మృతి

image

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన దేవరకద్రలో చోటుచేసుకుంది. SI నాగన్న వివరాలు.. కోడూరు గ్రామానికి చెందిన వాకిటి శివకుమార్(22), హరిజన్ గణేష్(20) ఇద్దరు స్నేహితులు ఈరోజు కన్నయ్య బావి దగ్గరకు ఈతకు వెళ్లారు. శివ కుమార్ బావిలోకి దిగి ఈత కొడుతుండగా గణేష్ కూడా మెల్లగా బావిలోకి దిగాడు. గణేష్‌కు ఈత రాక మునిగిపోతుండగా శివకుమార్ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ మునిగి చనిపోయారు.

News April 10, 2024

సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్

image

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీకే అరుణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికార అహంతో రేవంత్ రెడ్డి విర్ర వీగుతున్నాడని.. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్ లాగా అవుతారని పేర్కొన్నారు. ‘అరుణమ్మను విమర్శించే హక్కు ఎవరికీ లేదు. రైతుల అభివృద్ధి కోసం అరుణమ్మ పనిచేసింది. కాంట్రాక్టర్ల కోసం, పదవుల కోసం బిజెపిలో చేరలేదు’ అని అన్నారు.

News April 10, 2024

MBNR: 68,875 మందికి చెక్కర పంచాల్సిందే.. !

image

MBNR: చౌకధర దుకాణాల్లో ఇక నుంచి చక్కెర తప్పనిసరిగా పంపిణీ చేయాలని డీలర్లను పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఉచిత బియ్యంతోపాటు పంచదార ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2023 చౌక దుకాణాలు ఉన్నాయి. AAY లబ్ధిదారులు 68,875 మంది ఉన్నారు. వీరికి ప్రతినెల కిలో చొప్పున చక్కెర పంపిణీ చేయాలంటే ఉమ్మడి జిల్లాకు గోదాము నుంచి 96.88 టన్నుల దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

News April 10, 2024

పాలీసెట్-2024 పరీక్ష విధానం ఇలా..!

image

వనపర్తి: మే 24న పాలీసెట్-2024 రాత పరీక్ష ఉంటుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుందని, గణితం 60 నిమిషాలు, భౌతిక శాస్త్రం 30 నిమిషాలు, రసాయన శాస్త్రం 30 నిమిషాల వ్యవధిలో జవాబులు రాయవలసి ఉంటుందని అన్నారు. 9,10 వ తరగతి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయని ఆయన తెలిపారు.

News April 10, 2024

ఉమ్మడి జిల్లాలో కలగానే కల్లాల నిర్మాణాలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. రైతులు ధాన్యం ఆరబోతకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ యాసంగిలో‌ 4,78,649 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 8.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణాలు కలగానే మిగిలాయి. ధాన్యం ఆరబోతకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి కల్లాల నిర్మాణాలను చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

News April 10, 2024

MBNR: ఈనెల 15 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం

image

ఈనెల 15 నుంచి 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు  సంగ్రహణాత్మక మూల్యాంకనం(ఎస్ఏ)-2 పరీక్షలు నిర్వహించేందుకు టైం టేబుల్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని 4,187 పాఠశాలల్లో 1-9 వరకు చదువుతున్న 4,81,554 నుంచి విద్యార్థులు ఎస్ఏ-2 పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలకు డీఈవోల ఆధ్వర్యంలో సంబందిత జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ద్వారా ప్రశ్నపత్రాలు సరఫరా చేశారు.

News April 10, 2024

నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదం UPDATE..

image

బిజినేపల్లిలో డివైడర్‌ను తుఫాన్ ఢీకొట్టిన ఘటనలో మృతులు వసుంధర, భారతిగా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఉగాది సందర్భంగా కర్ణాటకకు చెందిన 13 మంది భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ డివైడర్ అసంపూర్తి, సూచికబోర్డులు లేక ఎన్నో ప్రమాదం జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.