India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలమూరులో డీకే అరుణమ్మ గెలవాలి.. దేశ ప్రధానిగా మళ్లీ మోడీ రావాలని అది మీదే బాధ్యతని, బిజెపి ప్రభుత్వం వస్తేనే దేశ సమగ్రత, అభివృద్ధి కాపాడగలుగుతామని, టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు బిజెపిలో చేరారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు, రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా గద్వాలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. BP, షుగర్, చర్మ వ్యాధులు ఉన్నవారు 11AM- 4PM మధ్య బయటకు రాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ద్వారానే దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో శుక్రవారం జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో నాగర్ కర్నూల్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి భరత్ పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో 38 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన సంవత్సరం 60 వేల ఎకరాల్లో పంటను సాగు చేయగా.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా 38 వేల ఎకరాలకే పరిమితమైంది. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. నేడు మరికల్ మండలం లాల్ కోట చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. దేవరకద్ర మండలం గురకొండకి చెందిన బిరప్ప రూ.8 లక్షల 40 వేలు కారులో తీసుకెళ్తుండగా సీజ్ చేసి ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామన్నారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలు వెంట ఉండాలన్నారు.
అచ్చంపేట మండలంలోని దుబ్బా తండాకు చేందిన కేతవత్ జవహర్(33) కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నట్లు సిద్దాపూర్ SI పవన్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాలు.. గురువారం తన వ్యవసాయ పొలంలో స్థభానికి జవహర్ ఊరేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో పొలానికి వెళ్లి జవహర్ సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి భార్య కవిత ఫిర్యాదుతో నేడు కేసు నమోదు చేసినట్ల పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రభంజనం మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఈసారి మోదీ ప్రభంజనంతో 400 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
CRPF జవాన్ విష్ణు మృతితో హన్వాడ మండలం వేపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోల్‌కతా సరిహద్దుల్లో విధి నిర్వహణలో చనిపోయినట్లు వచ్చిన సమాచారంతో విష్ణు సోదరుడు శేఖర్ మరో ఇద్దరితో కలిసి అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. అయితే విష్ణు 18నెలల క్రితమే ఈ ఉద్యోగం సాధించాడని, ప్రొబేషన్ పూర్తికాగా ఇటీవలే పోలీసులు వ్యక్తిగత వివరాలపై విచారణ జరిపారని ఇంతలోనే ఇలా జరిగిందని వారు వాపోయారు.
నాగర్ కర్నూల్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి భరత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్లాలంటే మోదీని 3వ సారి ప్రధానిగా ఎన్నుకోవాలని, మోదీ తీసుకొనే అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలతో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు.
Sorry, no posts matched your criteria.