Mahbubnagar

News April 8, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥NGKL:బహుజన లెఫ్ట్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బాలస్వామి
♥కేటీఆర్ నాగర్ కర్నూల్ పర్యటన వాయిదా
♥GDWL:రాష్ట్రంలో BRS లేదు.. దేశంలో కాంగ్రెస్ లేదు:DK అరుణ
♥NRPT:మూడురోజుల్లో హత్యకేసు ఛేదించిన పోలీసులు
♥సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు
♥ప్రజలు పార్లమెంట్ ఎన్నికలకు సహకరించాలి:SP
♥’ఇఫ్తార్ విందు’లో పాల్గొన్న SPలు,స్థానిక MLAలు
♥ప్రజావాణి లో ఫిర్యాదులు..సమస్యలపై ఫోకస్

News April 8, 2024

గద్వాల: రాష్ట్రంలో BRS లేదు.. దేశంలో కాంగ్రెస్ లేదు: డీకే అరుణ

image

గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో సోమవారం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో నియోజకవర్గ బీజేపీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRS లేదు.. దేశంలో కాంగ్రెస్ లేదని, కాంగ్రెస్, BRSకు ఓటువేస్తే నదిలో వేసినట్టే అని ఎద్దేవా చేశారు.

News April 8, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం.. యువతి హత్య !

image

యువకుడు ఓ యువతిని హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. స్థానికుల వివరాలు.. కల్వకుంట తండాకు చెందిన చిట్టెమ్మ(28) భర్తతో విడాకులు తీసుకుంది. కొంతకాలంగా బిజినేపల్లికి చెందిన శివతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నిన్న రాత్రి శివ ఫోన్ చేయడంతో వట్టెం శివారులోని పొలానికి వెళ్లింది. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణలో చిట్టెమ్మ చనిపోయింది. దీంతో మృతదేహాన్ని పత్తి చేనులో కప్పి నేడు పోలీసులకు శివ లొంగిపోయాడు.

News April 8, 2024

అచ్చంపేట: అత్తారింట్లో అల్లుడు సూసైడ్..?

image

అచ్చంపేట మండలంలో <<13009166>>అత్తారింట్లో అల్లుడు సూసైడ్<<>> చేసుకున్నాడు. గోదల్‌ చెందిన సుభాష్‌రెడ్డికి రంగాపూర్‌ వాసి లోహితతో గతేడాది పెళ్లైంది. వారి మధ్య గొడవలతో లోహిత పుట్టింట్లో ఉంటుంది. నిన్న రంగాపూర్‌కు వెళ్లిన సుభాష్‌ పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకొగా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. తనను హత్య చేయడానికి అత్తామామ, భార్య యత్నించారని వాంగ్మూలంలో సుభాష్‌ చెప్పినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదైంది.

News April 8, 2024

ఓపెన్ డిగ్రీ పరీక్షల తేదీలు ఖరారు !

image

డా.బీఆర్. అంబేడ్కర్ డిగ్రీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మే 17 నుంచి 20వ తేదీ వరకు, మూడో సంవత్సరం పరీక్షలు వచ్చే నెల 17 నుంచి 22 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మే 24 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మిగతా వివరాలకు వెబ్సైట్ www.braouonline.in లేదా ఎంవీఎస్ కళాశాలలో సంప్రదించాలని కోరారు.

News April 8, 2024

ఓపెన్ డిగ్రీ పరీక్షల తేదీలు ఖరారు !

image

డా.బీఆర్. అంబేడ్కర్ డిగ్రీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మే 17 నుంచి 20వ తేదీ వరకు, మూడో సంవత్సరం పరీక్షలు వచ్చే నెల 17 నుంచి 22 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మే 24 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మిగతా వివరాలకు వెబ్సైట్ www.braouonline.in లేదా ఎంవీఎస్ కళాశాలలో సంప్రదించాలని కోరారు.

News April 8, 2024

అమ్రాబాద్: చెక్ పోస్టుల నిబంధనల సడలింపు

image

అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 11 వరకు అటవీ నిబంధనలను సడలించినట్లు అమ్రాబాద్ రేంజ్ అధికారి ఆదిత్య తెలిపారు. 6 నుంచి 11వ తేదీ వరకు మన్ననూరు, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు వాహనాలను అనుమతించనున్నట్లు ఆదేశాలు వచ్చాయని, రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతిస్తున్నప్పటికీ ఒకేసారి కాకుండా కొన్ని వాహనాలను కలిపి పంపిస్తున్నారు.

News April 8, 2024

దేవరకద్ర మార్కెట్‌కు వరుస సెలవులు

image

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వరుసగా మొత్తం 6 రోజుల పాటు మార్కెట్‌కు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం ధాన్యం, ఉల్లి సీజన్‌ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడకుండా సెలవుల జాబితా విడుదల చేసినట్లు మార్కెట్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం అమావాస్య, మంగళవారం ఉగాది, బుధవారం కరి పండుగ, గురువారం, శుక్రవారం రంజాన్ సెలవులు ఉంటాయన్నారు. తిరిగి శనివారం ఒక్కరోజు లావాదేవీలు జరుగుతాయని చెప్పారు.

News April 8, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏GDWL,NRPT&NGKL: పలు గ్రామాల్లో కరెంట్ కట్
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(సోమ)-6:38,సహార్(మంగళ)-4:44
✏నేడు లోక్‌సభ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ
✏నేడు పాలమూరుకు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ రాక
✏ఇఫ్తార్ విందు.. హాజరుకానున్న ప్రముఖులు
✏పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✏ఉట్కూరు:నేటి నుంచి కాళికామాత జాతర ప్రారంభం
✏దేవరకద్ర:మార్కెట్ యార్డ్ కు వారం రోజులపాటు సెలవు
✏ఎలక్షన్ ఎఫెక్ట్.. పలుచోట్ల తనిఖీలు

News April 8, 2024

MBNR:’ఇఫ్తార్ విందు’.. ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు

image

రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఆదివారం అమరచింతలో డీఎంఆర్ఎం ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి స్వగృహంలో ‘ఇఫ్తార్ విందు’ ఇచ్చారు. ఇందులో MBNR కాంగ్రెస్, BJP ఎంపీ అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు పలకరించుకున్నారు. వీరితో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి, BJP రాష్ట్ర నాయకుడు కొండయ్య పాల్గొన్నారు.