India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒకప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన దేవ వరప్రసాద్.. తాజాగా ఏపీలో MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. ఈమేరకు వరప్రసాద్‌కు జనసేన అధినేత పవన్ రాజోలు టికెట్ ఖరారు చేశారు. ఆయన 2021లో జనసేన జనవాణి విభాగం కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో పౌరసరఫరాల సంస్థ MD, అబ్కారీ శాఖ డైరక్టర్‌గా సేవలందించారు.
జాతీయ మదింపు గుర్తింపు మండలి న్యాక్ గ్రేడ్ సాధనలో ఉమ్మడి జిల్లాలోని పీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. న్యాక్ గుర్తింపులో ఇప్పటివరకు గ్రేడ్ బి++ మాత్రమే ఉండగా జడ్చర్లలోని డా. బిఆర్ఆర్ డిగ్రీ కళాశాల తొలిసారిగా న్యాక్ ఎ-గ్రేడ్ సాధించింది. ఇది ఉమ్మడి జిల్లా చరిత్రలో ఓ నూతన అధ్యాయనమని చెప్పొచ్చు. న్యాక్ గుర్తింపు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం కళాశాలలకు నిధులు కేటాయిస్తుంది.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు అధికారి ఫ్లోరెన్స్ రాణి తెలిపారు. ఆసక్తి ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న ఉదయం 11 గంటలకు నుంచి మ. 1గంట వరకు ఉంటుందని చెప్పారు.
నారాయణపేటలో హోలీ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. నీటి ట్యాంకు కూలి పడి సాయి ప్రణతి(13) అనే చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానిక గోపాల్‌పేట వీధిలో కామ దహనం చేసిన సందర్భంగా నీటి ట్యాంకు మంటల వేడికి గురి కాగా.. ట్యాంకు వద్ద నీటిని పట్టుకునేందుకు వెళ్లిన చిన్నారులపై ట్యాంకు కూలి పడటంతో ఘటన జరిగింది. చిన్నారి మృతితో పండగపూట విషాదఛాయలు అలుముకున్నాయి.
ఒంటిపై వేడినూనె పడి <<12918373>>చిన్నారి జయదేవ్<<>>(3) మృతి వెల్దండ మండలం బండోనిపల్లిలో విషాదం నింపింది. అర్జున్, శారదమ్మ దంపతులు జాతరల్లో స్వీట్లు, తినుబండారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమనగల్లు వేంకటేశ్వరస్వామి జాతరలో స్వీట్లు విక్రయించేందుకు పిల్లలతో సహా వెళ్లారు. స్వీట్లు చేస్తుండగా జయదేవ్ ఒంటిపై నూనెపడి తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కళ్లముందే చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 26న ‘నాల్గో ప్రపంచ సాహిత్యం’ అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో ఒకరోజు కార్యశాల నిర్వహిస్తున్నట్లు పీయూ ఆంగ్ల విభాగాధిపతి డా. మాళవి తెలిపారు. మంగళవారం అకాడమిక్ బ్లాక్ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న స్కాలర్స్, అధ్యాప కులు, వివిధ విభాగాధిపతులు హాజరుకావాలని కోరారు.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఓటర్లు చేజారిపోకుండా అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. అటు కాంగ్రెస్ అభ్యర్థికి.. ఇటూ బీఆర్ఎస్ అభ్యర్థికి తమ ఓటు మీకే అంటూ ఓటర్లు సంకేతాలు పంపిస్తున్నారట. ఈ క్రమంలో ఓటర్లు చేజారకుండా నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటింగ్‌కు ఇంకా 4 రోజులే ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లపై గట్టి నిఘా పెట్టారు.
హోలీ అంటేనే రంగుల కేళి.. చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు ఈ వేడుక జరుపుకొనేందుకు పాలమూరు ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.
✓MPDO కార్యాలయం, MBNR – 245 మంది ఓటర్లు
✓MPDO కార్యాలయం, కొడంగల్ – 56 ఓటర్లు
✓MPDO కార్యాలయం, NRPT – 205 ఓటర్లు
✓RDO ఆఫీస్, వనపర్తి – 218 ఓటర్లు
✓ZP కార్యాలయం, GDL – 225 ఓటర్లు
✓బాలికల జూనియర్ కళాశాల, కొల్లాపూర్ – 67 ఓటర్లు
✓బాలుర ZPHS, NGKL – 101 ఓటర్లు
✓బాలికల ZPHS, అచ్చంపేట – 79 ఓటర్లు
✓ప్రభుత్వ జూనియర్ కళాశాల, కల్వకుర్తి – 72 ఓటర్లు
✓MPDO కార్యాలయం, షాద్నగర్ – 171 ఓటర్లు
✓మొత్తం ఓటర్లు – 1439.
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బతో ఉపాధి కూలీ చనిపోయిన ఘటన ఎర్రవల్లి మండలంలో జరిగింది. వల్లురుకు చెందిన చిన్నకృష్ణ(55) శనివారం ఉపాధి పనికి వెళ్లి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద చూపించారు. రాత్రి భోజనం చేసి పడుకున్న అతను తెల్లారేసరికి మృతిచెందాడు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎండల తీవ్ర నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.