Mahbubnagar

News March 22, 2024

సీఎం రేవంత్ రెడ్డి కలిసిన జిల్లా నాయకులు

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకులు శుక్రవారం ఆయన చాంబర్ లో కలిశారు. మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రతాప్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల అంశంపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు.

News March 22, 2024

పాలమూరులో ఆపరేషన్ ఆకర్ష్..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో BRS పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారు.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, పురపాలిక చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు, MPTCలు BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆపరేషన్ ఆకర్ష్ మరింత వేగం అందుకున్నట్లు తెలుస్తోంది.

News March 22, 2024

రసవత్తరంగా మహబూబ్‌నగర్ MLC ఉపఎన్నిక

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుంది. దీంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కాపాడుకునేందుకు నేతలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే వివిధ మండలాల నుంచి ఓటర్లను క్యాంప్‌కు తీసుకెళ్లగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారని సమాచారం.

News March 22, 2024

గద్వాల: చిన్నారులకు లివర్ ప్రాబ్లం.. సాయం కోసం ఎదురుచూపు

image

ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నెకు చెందిన మౌనిక, మల్దకంటి దంపతుల బాబు జాన్సన్ లివర్ ప్రాబ్లంతో బాధ పడుతున్నాడు. వైద్యానికి రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో వారు దిక్కుతోచని స్థితి ఉన్నారు. వారి పెద్ద కుమార్తె లివర్ వ్యాధి బారినపడి మృతి చెందింది. మౌనికకు రెండు వారాల క్రితం పుట్టిన చిన్నారికి సైతం అదే సమస్య ఉంది. లివర్ మార్చితే బతికే అవకాశ ఉందని.. ఆర్థిక సాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు.

News March 22, 2024

మల్లు రవి రాజకీయ ప్రస్థానం

image

1950లో ఖమ్మం జిల్లాలో జన్మించిన మల్లు రవి ఎంబీబీఎస్, డీఎల్వో చదివారు. భార్య రాజబన్సిదేవి , కుమార్తె అనంత శృతి, కుమారుడు సిద్దార్ధ. 1991, 1998లో రెండుసార్లు నాగర్ కర్నూల్ నుంచి MPగా గెలిచారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, అనంతరం దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయనున్నారు.

News March 22, 2024

NGKL: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కొడుకునే చంపేసింది

image

బిజినేపల్లి మండలం అల్లీపూర్‌లో కన్న <<12896690>>కొడుకుని హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రవీందర్‌, లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు. అన్నలిద్దరూ హాస్టల్‌లో ఉండగా హరికృష్ణ ఇంటి వద్దే ఉంటున్నాడు. భర్త తాగుడుకు బానిస కావడంతో లక్ష్మి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తన విషయం కొడుక్కి తెలిసిందని భావించిన ఆమె హరిని చంపి సంపులో పడేసింది. లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

News March 22, 2024

ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. 23 ,26వ తేదీల్లో శిక్షణ

image

MLC ఉపఎన్నిక నిర్వహణకు పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్, POలు, APOలను నియమించాలని కలెక్టర్ రవి నాయక్ అన్నారు. వీరికి ఈనెల 23, 26వ తేదీల్లో మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇవ్వాలని, మొత్తం పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, MBNR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ఉంటుందన్నారు. అక్కడి నుంచే ఈనెల 27న పోలింగ్ సామగ్రిని ఆయా కేంద్రాలకు పంపిణీ చేస్తామన్నారు.

News March 22, 2024

MBNR, NGKLలో మొదలైన ఎన్నికల సందడి..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా MP ఎన్నికల సందడి మొదలైంది. నిన్న సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్-12, BRS- 2 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ బలంగానే కనిపిస్తోంది. లోక్ సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

News March 22, 2024

MBNR: జిల్లా గ్రీవెన్స్ కమిటీ నియామకం

image

మహబూబ్ నగర్: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా పరిమితికి మించి రూ.50వేల నగదు, బంగారు, ఇతర ఆభరణాలు తరలిస్తే ఆధారాలు వెంట ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ తెలిపారు. జడ్పీ సీఈవో బి. రాఘవేంద్రరావు, జిల్లా ఆడిట్ అధికారి ఎం.శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి బి.పద్మ, కోశాగార ఉప సంచాలకుడు బి.శ్రీనివాస్ లతో జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News March 22, 2024

MBNR: DSCకి ఉచిత శిక్షణ.. నేడే చివరి తేదీ

image

మహబూబ్ నగర్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DSC(ఎస్టీజీ, ఎస్ఏ) పరీక్షపై అందించే ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 తుది గడువు అని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న అన్నారు.MBNR,NGKL,NRPT జిల్లాలకు చెందిన బీసీ నిరుద్యోగ అభ్యర్థులు నిర్దేశిత వెబ్ సైడ్ www.tsbcstudycircle.cgg.inలో దరఖాస్తులు చేసుకోవాలని, మిగతా వివరాలకు MBNR పట్టణం మెట్టుగడ్డలోని స్టడీ సర్కిల్లో సంప్రదించాలన్నారు.

error: Content is protected !!