Mahbubnagar

News April 6, 2024

WNPT: క్షుద్రపూజల పేరుతో రూ.9.73 లక్షలు టోకరా

image

క్షుద్రపూజలు చేసి నయం చేస్తామని రూ.9.73లక్షలు తీసుకుని మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. CI నాగభూషణరావు వివరాలు.. వనపర్తి జిల్లా గోపాల్‌వేటకు చెందిన సుద్దుల రాజు కొడుకు వెంకటేశ్(14)కు మతిస్తిమితం సరిగా లేదు. జ్యోతిష్యాలయం పేరుతో నయం చేస్తామని నమ్మించి మోసం చేసిన APలోని గుంటూరుకు చెందిన పరబ్రహ్మం, వెంకన్న, గోపిను అరెస్ట్ చేసి ఫోన్లు, రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

News April 6, 2024

MBNR: ఓటర్లకు కలెక్టర్ల సూచనలు

image

✔ఫారం-12 నింపి, ఓటర్ కార్డు జత చేసి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ✔పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 15 లాస్ట్
✔మే 3 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ అందజేసిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్
✔18 ఏళ్ల వయసు ఉంటే నూతన ఓటరుగా దరఖాస్తు
✔ఏప్రిల్ 14లోపు నూతన ఓటర్ నమోదు
✔మే 13వ తేదీన లోక్ సభ ఎన్నికల పోలింగ్

•ఈ మేరకు ఉమ్మడి జిల్లా రిటర్నింగ్ అధికారులు, కలెక్టర్లు సూచించారు.

News April 6, 2024

ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు

image

JEE మెయిన్స్ సెషన్-2 పరీక్షలు ఉమ్మడి పాలమూరులో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఫాతిమా విద్యాలయంలో ఉదయం పూట నిర్వహించిన పరీక్షకు 147మందికి గాను 135మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 147మందికి గాను 134మంది హాజరయ్యారు. ధర్మాపూర్ సమీపంలోని జేపీఎన్సీఈ కళాశాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 180మందికి గాను 158మంది, మధ్యాహ్నం 180కి గాను 162 మంది హాజరయ్యారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులు 9 మందికి 1 గైర్హాజరయ్యారు.

News April 6, 2024

నేడు తుక్కుగూడ సభ.. పాలమూరు వాహనదారులకు అలర్ట్

image

కాంగ్రెస్‌ పార్టీ శనివారం తుక్కుగూడలో తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో.. సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. MBNR నుంచి వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్‌ బెంగుళూరు టోల్‌ నుంచి రావిర్యాల టోల్‌ వద్దనుంచి ఫ్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.

News April 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏నేడు PUలో జాతీయ సదస్సు
✏ధరూర్: నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
✏వనపర్తి: నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(శని)-6:38,సహార్(ఆది)-4:45
✏నేడు ‘జనజాతర బహిరంగ సభ’.. ఉమ్మడి జిల్లా నుంచి తరలి వెళ్ళనున్న నేతలు, కాంగ్రెస్ శ్రేణులు
✏నేడు MVSలో ‘వచన కవిత’ కార్యాశాల
✏నేడు పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’.. హాజరుకానున్న నేతలు
✏పలు నియోజకవర్గంలో పర్యటించనున్న MBNR&NGKL ఎంపీ అభ్యర్థులు

News April 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేడు బీఆర్ఎస్ నిరసనలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 10 నుంచి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమానికి అధిష్ఠానం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఉమ్మడి జిల్లాలోని అయా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

News April 6, 2024

NGKL: ‘వలస వాది మల్లురవిని తరిమి కొడుదాం’

image

వలస వాది మల్లురవిని తరిమి కొడుదామని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ వంద రోజులు పూర్తి అయిన రుణమాఫీ చేయలేదని, ఇది పేదల కాంగ్రెస్ పార్టీ కాదని, రైతులను మోసం చేసే కాంగ్రెస్ అని విమర్శించారు.

News April 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ‘TOP NEWS’

image

♥ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
♥GDWL: బొలెరో బోల్తా.. ఇద్దరు మృతి
♥కల్వకుర్తి: యాక్సిడెంట్‌లో టీచర్ మృతి
♥NRPT: వ్యక్తి దారుణ హత్య.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
♥కాంగ్రెస్‌పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు: గువ్వల
♥WNPT: రేపు 5K రన్
♥ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు:MRPS
♥CSK-HYD మ్యాచ్ చూసేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా నేతలు

News April 5, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో అలర్ట్..

image

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని, తీవ్రమైన వడగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే బయటకు వెళ్లాలని, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

News April 5, 2024

రసవత్తరంగా పాలమూరు రాజకీయం

image

MBNR పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది.. ప్రధాన పార్టీల అభ్యర్థులు డీకే అరుణ, డా.వంశీచంద్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీటు చేజార్చుకోవద్దని కాంగ్రెస్, BRS, BJP పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో పాలమూరు రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరికి వారు విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.