Mahbubnagar

News March 30, 2024

MBNR: గురుకుల కళాశాలలో 2,160 సీట్లు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బాలుర గురుకుల కళాశాలలు 12, బాలికల గురుకుల కళాశాలలు 13 వంతున మొత్తం 25 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఎసీ, ఎంఈసీ, వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బాలురకు 1,040, బాలికలకు 1,120 సీట్లు ఉన్నాయి. BCలకు 75%, SCలకు 15%, STలకు 5%, OC/EBCలకు 2%, అనాథలకు 3% సీట్లు కేటాయించారు.

News March 30, 2024

MBNR: సంవత్సరానికి రూ.3,08,12,000 ఖర్చు

image

ఉమ్మడి జిల్లాలోని MBNR-441, NGKL-453, GDWL-255, WNPT-255, NRPT-280 మొత్తం 1884 నర్సరీలకు ఏటా రూ.3,08,12,000 వరకు ఖర్చవుతోంది. ఎండల తీవ్రత మూలంగా మొక్కలకు నీడ కల్పించేందుకు ఇటీవల షేడ్ నెట్‌లను కొనుగోలు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుండటంతో చిన్నపాటి గాలులకే చిరిగిపోతున్నాయి. ప్రతి నర్సరీకి శాశ్వత షేడ్ నెట్ ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

News March 30, 2024

దౌల్తాబాద్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం దౌల్తాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన యాదగిరి(28) ఈరోజు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీశైలం యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 30, 2024

జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మహేశ్( 26) శుక్రవారం 9 గంటలకు అయ్యవారిపల్లి నుంచి జడ్చర్లకు వెళ్తున్నాడు. ఈక్రమంలో గంగాపూర్ శివారు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో మరణించాడని గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News March 30, 2024

MBNR: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్

image

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీ రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దిన కూలీ రూ.272 ఉండగా.. ఏప్రిల్ 1 నుంచి ఇది రూ.300 కానుంది. దీంతో కూలీలకు అదనంగా రూ.28 లభించనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14.50 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వ్యవసాయేతర పనులకు వెళితే రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు. 

News March 30, 2024

నారాయణపేట: రూ.12లక్షల నగదు పట్టివేత

image

నారాయణపేట జిల్లా పరిధిలోని వివిధ చెక్‌ పోస్టుల వద్ద శుక్రవారం జరిగిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. మరికల్ మండలం లాల్కోట చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా దేవరకద్ర మండలం గూరకొండ గ్రామానికి చెందిన బీరప్ప వద్ద రూ.8.40 లక్షలు, పేట మండలం ఎక్లాస్పూర్ చెక్‌పోస్టు వద్ద రూ.1.50 లక్షలు, దామరగిద్ద మండలం కాన్కుర్తి చెక్‌పోస్టు వద్ద రూ2.15 లక్షలను పట్టుకున్నారు.

News March 30, 2024

మరికల్: బైక్‌ చక్రంలో చున్ని చుట్టుకొని మహిళ మృతి

image

కర్నూల్ జిల్లాకు చెందిన మాధవి భార్తతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ మండలంలో జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లో తిరిగి గ్యాస్ పొయ్యి మరమ్మతులు చేసేవారు. ఈ క్రమంలో శుక్రవారం దేవరకద్ర మండలం కోయిలసాగర్ వద్ద బైక్‌కి చున్ని చుట్టుకొని కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదన్నారు.

News March 30, 2024

నాగర్ కర్నూల్‌పై అందరి గురి..!

image

NGKL MP స్థానంపై BRS, కాంగ్రెస్, BJP స్పెషల్ ఫోకస్ పెట్టాయి. BJP సిటింగ్ MP తనయుడు పోతుగంటి భరత్ బరిలోకి దించగా, కాంగ్రెస్ మల్లు రవిను పోటీలో నిలబెట్టింది. BRS వ్యూహాత్మకంగా లోకల్ క్యాండిడేట్ RS ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దింపింది. ఇప్పటికే NGKLలో PM మోదీ ప్రచారం చేయగా, KCR, రేవంత్ రెడ్డి సైతం ప్రచారం చేస్తారని టాక్. 3 పార్టీలు NGKLలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీనిపై మీ కామెంట్?

News March 30, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు!

image

✏ MBNR&NRPT జిల్లాలలో నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం
✏ GDWL: పలు గ్రామాలలో నేడు కరెంట్ కట్
✏ నవాబుపేట: నేడు టెంకాయల వేలం& నేటి నుంచి బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
✏ పన్ను వసూలుపై అధికారుల ఫోకస్
✏ పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’.. పాల్గొననున్న నేతలు
✏ పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న MBNR,NGKL ఎంపీ అభ్యర్థులు
✏ నేటి రంజాన్ వేళలు:- ఇఫ్తార్(SAT)-6:37,సహర్(SUN)-4:51
✏ త్రాగునీటి సమస్యలపై అధికారుల నిఘా

News March 30, 2024

బిజినేపల్లి: చిరుతల సంచారం.. జాగ్రత్త

image

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం అటవీ ప్రాంతంలో రెండు నెలలుగా చిరుతల సంచారం అడవికి సమీపంలో ఉన్న గిరిజన తండా వాసులకు అలజడి రేపుతోంది. తాగునీటి కోసం పులులు రాత్రి సమయాల్లో వస్తుంటాయి. కాబట్టి పరిసర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని FRO తెలిపారు. భీముని తండా సమీపంలో కేఎల్‌ఐ కాలువ వద్ద చిరుత పులి రోడ్డు దాటుకుంటూ వెళ్లిందని చెప్పాడు.