India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికల యుద్ధం నడిచించి. అయితే లెక్క ప్రకారం వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌కు ఉండగా.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఎంఈడి మొదటి, మూడవ సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల టైం టేబుల్‌ను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 15 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలిపారు. టైం టేబుల్ యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు.
ఇంట్లో నుంచి భారీగా బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకు పోయిన సంఘటన గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగ బాయి కాలనీలో చోటు చేసుకుంది. యజమాని ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లి వచ్చేసరికి దొంగలు చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు సుమారు రూ.10 లక్షలు అపహరణకు గురైందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో హోరాహోరీగా తలపడిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం పై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ ప్రతినిధులు అధికంగా ఉన్నందున నా విజయం ఖాయం అంటూ నవీన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి సైతం విజయం పై ధీమాతో ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయాలకు EDని ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్ధి RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఏ మాత్రం ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలకు 2023-24 విద్యా సంవత్సరానికి చివరి పని దినం ఈ నెల 30 (శనివారం)గా పేర్కొంటూ ఇంటర్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వేదికను సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సభకు అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నట్లు తెలిపారు. అదే సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోందని చెప్పారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అయితే క్రాస్ ఓటింగ్ భయం ప్రతిపక్ష పార్టీని కంగారు పెడుతోంది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓడిపోతే కారు పార్టీకి మరో షాక్ తగిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఇరు పార్టీల నాయకులు ధీమాతో ఉన్నారు.
కొడంగల్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభకు రాహుల్ గాంధీ రానున్నారని, జాతీయ స్థాయిలో 5 గ్యారంటీలను ప్రకటిస్తారని వెల్లడించారు. సభా కార్యక్రమానికి నియోజకవర్గంలో నుంచి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి నిర్వహించే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు వేసుకొని పని చేయాలని, ఏప్రిల్ 8న కొడంగల్ మళ్లీ వచ్చి సమన్వయ కమిటీ సభ్యులతో ఎంత మెజార్టీ ఇస్తారో రాయించుకుని సంతకాలు తీసుకుంటానన్నారు. ఇవే సమన్వయ కమిటీలు తర్వాత నిర్వహించే ఇందిరమ్మ కమిటీలుగా రూపాంతరం చెందుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.