India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మోసగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. లాటరీ తగిలిందని కొంత డబ్బు జమ చేస్తే మిగతా డబ్బులు ఇస్తామని చెప్పే మాయ మాటలు నమ్మకండని చెప్పారు. అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ATM, OTP నంబర్లు ఇవ్వరదాని, ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. 99.86% పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 1439 ఓట్లకు గాను 1437 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరు ప్రతినిధులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోలేదు. NGKL, NRPT నియోజకవర్గంలో ఒక్కొక్కరు ఓటు వేయలేదు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 బూతులలో పోలింగ్ ఏర్పాటు చేశారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాలలో 1439 మంది ఓటర్‌లకు గాను 1437 మంది ఓటర్‌లు (99.86%,) ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ ఎం.పి.డి. ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 245 మందికి 245 మంది ఓటర్‌లు 100 శాతం పోలింగ్ నమోదయ్యింది.
పోలీస్ విధులు ప్రజలకు చేరువ అయ్యేలా ఉండాలని గద్వాల SP రితిరాజ్ సూచించారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం విజిట్ చేశారు. స్టేషన్ పరిసరాలు రికార్డులు పరిశీలించారు. పనిచేయని సీసీ కెమెరాలు పునరుద్ధరించాలన్నారు. అనంతరం బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 13 మంది తమ సమస్యలను ఎస్పీతో మొరపెట్టుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు.
ఎన్నికలు వస్తే ఎవరైనా తీర్థ యాత్రలకు వెళ్దాం అనుకుంటారు.. కానీ నాకు కొడంగల్‌కు వస్తేనే మనశ్శాంతిగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో కొడంగల్‌కు సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతోందని చెప్పారు. ఎక్కడైనా పరిశ్రమలు వస్తేనే.. అక్కడి భూములకు విలువ పెరుగుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు.
తాతయ్య వర్ధంతి కార్యక్రమానికి వెళుతూ.. రోడ్డు ప్రమాదానికి గురై నారాయణపేట జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకెన్ పల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ (21) హైదరాబాదులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పూలు, పండ్లు ఇతర సామగ్రిని తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా.. మరికల్ మండలం ఎలిగండ్ల గ్రామం వద్ద లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. బుధవారం పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్న్ అధికారి, జిల్లా కలెక్టర్ రవి నాయక్ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు లేని వ్యక్తిని లోపలికి అనుమతించకూడదని సిబ్బందికి తెలిపారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉపఎన్నిక లెక్కింపు ఏప్రిల్ 2న ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేపడుతున్నట్లు కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. ఆయా కేంద్రాల నుంచి వచ్చే బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ సామగ్రి రిసెప్షన్ కేంద్రంలో అందించేందుకు కౌంటర్ ఏర్పాట్లపై ఆర్డీవోకు సూచనలు చేశారు. ఇప్పటికే బ్యాలెట్ పెట్టెలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, లెక్కింపు హాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
అమరచింత మండలం కామరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రాజు(22) పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు ప్రస్తావన తీసుకురావడంతో నిరాకరించిన అతను మనస్తాపానికి గురై మన్యంకొండ దేవస్థానం సమీపంలో చెట్టుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు.
ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ప్రక్రియను కట్టుదిట్టమైన భద్రత మధ్య చేపట్టిన అధికారులు ప్రశాంతంగా ముగించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తన చాంబర్ నుండి పర్యవేక్షిస్తున్నారు. ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సూచనలిచ్చారు.
Sorry, no posts matched your criteria.