India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల ఆధార్ అవసరమైన వారికి తపాలా శాఖ ద్వారా ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి ఆధార్ నమోదు సేవలను అందిస్తున్నట్లు తపాల శాఖ డివిజన్ పర్యవేక్షకుడు రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 9553062368 నంబర్‌కు సంప్రదించాలన్నారు. ఎందుకు మున్సిపల్, పంచాయతీ లేదా ఆస్పత్రిలో పొందిన జనన ధ్రువీకరణ పత్రాన్ని తపాల సిబ్బందికి చూపించాలన్నారు. దీని ద్వారా పోర్టల్‌లో వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు
ఉమ్మడి పాలమూరు జిల్లా త్రాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో పేరుపొందిన రామన్ పాడ్ జలాశయం అడుగంటి పోతుంది. గత సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురువకపోవడంతో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో సాగు త్రాగునీటికి ఇబ్బందికరంగా మారింది. వర్షాలు లేక ప్రాజెక్టులో నీరు లేక రామన్ పాడ్ జలాశయంపై ఆధారపడిన గ్రామాలు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు.
✔ఏర్పాట్లు పూర్తి..నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
✔అలంపూర్:పలు గ్రామాలలో కరెంటు కట్
✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఇఫ్తార్ విందు
✔MBNR:PUలో నేడు వర్క్ షాప్
✔పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు
✔MLC ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(గురు):6-36,సహార్( శుక్ర):4-53
✔ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..ఓట్ల లెక్కింపుపై సమీక్ష
✔ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు
✔ఎండిపోతున్న పంటలపై అధికారుల ఫోకస్
MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నిక కోసం మన్నె జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), నవీన్‌కుమార్‌రెడ్డి(బీఆర్ఎస్), సుదర్శన్‌గౌడ్(స్వతంత్ర అభ్యర్థి) బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా క్యాంపులో ఉన్నారు. వీరు నిన్న కర్ణాటకకు చేరుకున్నారు. పోలింగ్ టైంకి కేంద్రాలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో సెక్టార్, రూట్ అధికారులు, పీవో, ఏపీవోలు కలిపి మొత్తం 450 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల పరిశీలకురాలిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతికశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
1.MBNR(ఎంపీడీఓ కార్యాలయం)-245
2.కొడంగల్(ఎంపీడీఓ కార్యాలయం)-56
3.NRPT(ఎంపీడీఓ కార్యాలయం)-205
4.WNPT(ఆర్డీఓ ఆఫీస్)-218
5.GDWL(జడ్పీ కార్యాలయం)-225
6.కొల్లాపూర్(బాలికల జూనియర్ కళాశాల)-67
7.NGKL(బాలుర జడ్పీహెచ్ఎస్)-101
8.అచ్చంపేట(బాలికల జడ్పీహెచ్ఎస్)-79
9.కల్వకుర్తి(ప్రభుత్వ జూనియర్ కళాశాల)-72
10.షాద్ నగర్(ఎంపీడీఓ కార్యాలయం)-171
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు,1,439 మంది ఓటర్లు ఉన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది.
✓MBNR ఎంపీడీవో కార్యాలయం 245.
✓ కోడంగల్ MPDO కార్యాలయం 56.
✓పేట MPDO కార్యాలయం 205.
✓వనపర్తి RDO కార్యాలయం 218. ✓గద్వాల ZP కార్యాలయ సమావేశం మందిరం 225.
✓కొల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 67.
✓ నాగర్ కర్నూల్ GOVT బాలుర కళాశాల 101 .
అచ్చంపేట ZPHS బాలికల పాఠశాల 79 ✓కల్వకుర్తి ప్రభుత్వ కళాశాల 72.
షాద్నగర్ ఎంపీడీవో కార్యాలయం 71.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా కొడంగల్ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు వేసేందుకు గురువారం రానున్నట్లు కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. సీఎం రానున్న నేపథ్యంలో రాజేంద్రనగర్, చేవెళ్ల ట్రాఫిక్ ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. ఇటు కొడంగల్‌లో కూడా అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దింపామన్నారు.
ఉమ్మడి MBNR జిల్లాలో బుధవారం జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో BJP ఓట్లు కీలకం కానున్నాయి. మొత్తం 1,439 ఓట్లలో దాదాపు 119 ఓట్లు BJPకి ఉన్నాయి. ఎన్నికల్లో BJP అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్ల ఆ ఓట్లు ఏ పార్టీకి పడతాయోనని రాజకీయ వర్గాలలో చర్చ కొనసాగుతుంది. కొంతమంది కాంగ్రెస్, మరి కొంతమంది BRS వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావితం చూపే అవకాశం ఉంది.
✏NRPT:ACBకి పట్టుబడ్డ గుండుమాల్ తహశీల్దార్ పాండు
✏హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలం:డీకే అరుణ
✏సర్వం సిద్ధం.. రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక!
✏WNPT:శ్రీరంగపురం టెంపుల్‌లో హీరో సిద్దార్థ్ పెళ్లి
✏WNPT:’యాప్‌లో రూ.1,75,000 స్వాహా’
✏ఆయా జిల్లాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు
✏రాష్ట్రంలో 14 పార్లమెంటు స్థానాలలో గెలుస్తాం:వంశీచంద్ రెడ్డి
✏ఉమ్మడి జిల్లాలో హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు
Sorry, no posts matched your criteria.