Mahbubnagar

News March 17, 2024

ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం!

image

బల్మూరు: ప్రేమ విఫలమై యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ASI రేణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హరికృష్ణ(25) తాను ప్రేమించిన యువతికి పెళ్లి చేస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో ఈ నెల 10న పురుగు మందు తాగాడు. HYDలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

News March 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔కోడ్ కూసింది.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సందడి
✔పదో తరగతి పరీక్షలపై అధికారుల సమీక్ష
✔నూతన ఓటు నమోదు పై అధికారుల ఫోకస్
✔శ్రీరంగాపురం:నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
✔పలు నియోజక వర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పర్యటన
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(ఆది):6:34,సహార్(సోమ):5:02
✔నేడు సార్వత్రిక డిగ్రీ తరగతులు
✔పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔NRPT:పలు మండలాలలో కరెంటు కట్
✔ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్

News March 17, 2024

బీజేపీలో విలువలు సిద్దాంతాలు లేవు: జితేందర్ రెడ్డి

image

బీజేపీలోని నాయకులకు సిద్ధాంతాలు, విలువలు లేవని.. ఈర్ష్య, అసూయ, ద్వేషం, గ్రూప్ రాజకీయాలే ఉన్నవని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ఏపీ. జితేందర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు కారణం చెప్పకుండా ఎంపీ టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారని అన్నారు. 50ఏళ్ల ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరని, అభ్యర్థుల కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

News March 17, 2024

మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: DK అరుణ

image

రాష్ట్రంలో ప్రజల తరపున బీజేపీ పోరాటం చేస్తే అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, MBNR లోక్ సభ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. విజయ సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్లలో చేయనివి బీజేపీ పదేళ్లలోనే చేసి చూపెట్టిందని, ప్రధాని మోదీ భారత్ కీర్తిని పెంచుతుంటే కాంగ్రెస్ మాత్రం విషం చిమ్ముతోందని, ప్రతి ఒక్కరి నోటి వెంట మోదీ మాటే వినిపిస్తోందని అన్నారు.

News March 17, 2024

నాగర్‌కర్నూల్‌: ఎంపీవోపై ఎంపీపీ దాడి

image

విధుల్లో ఉన్న ఎంపీవోను ఎంపీపీ ఆగ్రహంతో చెప్పుతో కొట్టిన ఘటన కోడేరులో జరిగింది. బాధితుడి వివరాలు.. పెండింగ్ బిల్లుల విషయంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇరువురు మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎంపీపీ వెంకటరాధ దుర్భాషలాడుతూ.. నా మాట ఎందుకు వినడంలేదంటూ ఎంపీ చెప్పుతో కొట్టి ఆగ్రహంతో వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఎంపీవో శ్రావణ్‌కుమార్‌ ఫిర్యాదుతో ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేశారు.

News March 17, 2024

నాగర్ కర్నూల్‌పై బీజేపీ ఫోకస్

image

నాగర్ కర్నూల్‌పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో 1, 29, 021 ఓట్లు సాధించగా ఈసారి పక్కా గెలుస్తామని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. కాగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ పోటీలో ఉన్నారు.

News March 16, 2024

గద్వాల: రెండు బైక్ ఢీ.. ఒకరి మృతి

image

రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన గద్వాల జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ధరూర్ మండలం అల్వాల్ పాడ్ గ్రామానికి చెందిన రమేష్ (26) అదే గ్రామానికి చెందిన రాము.. బైక్ పై ధరూర్ మండల కేంద్రానికి వెళ్తుండగా పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో రమేష్ మృతి చెందాగా.. రాము తీవ్రంగా గాయపడ్డాడు. రాముని ఆస్పత్రికి తరలించారు.

News March 16, 2024

వెల్దండ: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

image

ఆర్టీసీ బస్సు టాలీ ఆటో ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన వెల్దండ మండలం కుట్ర గేట్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కల్వకుర్తి మండలం యంగంపల్లి గ్రామానికి చెందిన సంపత్ (22) వెల్దండ మండలం గుండాల దేవస్థానం వద్ద బొమ్మల అమ్ముకునేవాడు. సంపత్
తన నివాసానికి వెళుతుండగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

News March 16, 2024

SDNR: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ మాజీ ఉద్యోగి మృతి

image

షాద్ నగర్ పట్టణ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఆర్టీసీ మాజీ ఉద్యోగి, కార్మిక నాయకుడు బిజీ రెడ్డి దుర్మరణం చెందారు. వాహనం నడుపుకుంటూ వచ్చిన ఆయన అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయమై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆర్టీసీ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!

image

♥17 స్థానాల్లో BJPని గెలిపించండి:మోదీ
♥MBNR:ఈతకు వెళ్లి బాలుడు మృతి
♥NGKL:భార్యను చంపి భర్త ఆత్మహత్య
♥కల్వకుర్తి సమీపంలో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి
♥ఉమ్మడి జిల్లాలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
♥GDWL:Way2News స్పందన.. కొత్త బస్టాండ్ లో ఫ్రిడ్జ్ మరమ్మతులు
♥MLC కవిత అరెస్టుపై ఉమ్మడి జిల్లాలో ‘BRS’ నేతల నిరసన
♥WNPT:మహాలక్ష్మి క్లినిక్ తాత్కాలికంగా సీజ్!
♥మోడీ సభ..BJP శ్రేణుల్లో జోష్

error: Content is protected !!