India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బతో ఉపాధి కూలీ చనిపోయిన ఘటన ఎర్రవల్లి మండలంలో జరిగింది. వల్లురుకు చెందిన చిన్నకృష్ణ(55) శనివారం ఉపాధి పనికి వెళ్లి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద చూపించారు. రాత్రి భోజనం చేసి పడుకున్న అతను తెల్లారేసరికి మృతిచెందాడు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎండల తీవ్ర నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
✏MBNR:నేడు మన్యం కొండాలో అలివేలు మంగతాయారు ఉత్సాహాలు
✏గద్వాల్:పలు మండలాలలో కరెంట్ కట్
✏నేడు హోలీ.. పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✏యాసంగి వరి ధాన్యం.. కొనుగోలుకు కసరత్తు
✏MLC ఎన్నికలు.. ఓటర్లపై ఫోకస్
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(MON)-6:36,సహార్(TUE):4:56
✏’ELECTION-EFFECT’.. పలుచోట్ల తనిఖీలు
✏బాలానగర్:తిరుమల నాథ స్వామి వేడుకలు షురూ
✏ఉమ్మడి జిల్లాలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు
✏త్రాగునీటిపై సమీక్ష
మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5,6,7వ తరగతుల్లో ప్రవేశాలకుగాను దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని భగీరథ కాలనీలోని గురుకుల పాఠశాల-3 ప్రిన్సిపల్ కె.సురేఖ తెలిపారు. నాల్గో తరగతి చదువుతున్న దరఖాస్తు చేసుకోవాలని, 80 సీట్లలో 60 ముస్లింలకు, 20 రిజర్వేషన్ ప్రాతిపాదికన భర్తీ చేశామన్నారు. 6, 7వ తరగతుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళా సంఘాలకు ఊరట లభించింది. ప్రభుత్వం వారి ఖాతాల్లో కొన్ని నెలలకు సంబంధించిన వడ్డీ నగదును మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు రూ.25.73 కోట్లు మంజూరు కాగా నేరుగా స్వయం సహాయక సంఘాల సేవింగ్ ఖాతాల్లో ఈ నిధులను జమ చేస్తున్నారు. అయితే మొత్తం కాకుండా కేవలం మూడు నెలలకు సంబంధించిన రాయితీని మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది.
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) ఆధ్వర్యంలో మహిళా దివ్యాంగుల సదస్సు హైదరాబాదులో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీలో వనపర్తి పట్టణానికి చెందిన దివ్యాంగురాలు లక్ష్మీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా NPRD జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ స్వామి, శ్యాంసుందర్ రెడ్డి, మీసాల మోహన్ ప్రభాకర్ శెట్టి, గట్టన్న, భాగ్యలక్ష్మి,, మంగమ్మ హర్షిస్తూ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
✓ ఉపఎన్నిక EVMల ద్వారా కాకుండా బ్యాలెట్ విధానంలో ఉంటుంది.
✓ బ్యాలెట్ బాక్స్ ఖాళీగా ఉందని అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు చూపాలి.
✓ బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయడం, మూసివేయడం, సీలింగ్ చేసే పద్ధతి గురించి తెలుసుకోవాలి.
✓ బ్యాలెట్ పేపర్ మడత పెట్టడంపై అవగాహన కలిగి ఉండాలి.
✓ పోలింగ్ కేంద్రంలోకి ఒకేసారి నలుగురు ఓటర్లను మాత్రమే అనుమతి.
✓ ఓటర్లు 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపినా అనుమతించాలి.
హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా పెద్దా అంతా రంగుల్లో మునిగి తేలే పండుగ. వసంతకాలం వేడుక. పల్లె పట్నం అంతా ఎల్లలు దాటేలా సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా ఆలయాలుముంగిళ్లు, వాకిళ్లు రంగులతో తడిసి మురిసే సంబరం. ప్రకృతి ప్రసాదించిన సహజ రంగులతో హోళీ ఆడుకుందాం సంతోషాల సంబరాలను జరుపుకుందాం. >>HAPPY HOLI
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలు, రోడ్షోలు, సమావేశాలు ఏర్పాటు విషయమై చర్చించామని నేతలు తెలిపారు. పాలమూరు మహాసభకు రాహుల్ గాంధీ ఆహ్వానించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ నాయకుడు మెట్టు కాడి శ్రీనివాస్, పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులకు పార్టీ కండువా చేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి డీకే అరుణ తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.