India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ బాలింత మృతిచెందిన సంఘటన అచ్చంపేటలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన కల్పన (29) ప్రసవం కోసం గురువారం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఓ వైద్యుడు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడు. డెలివరీ అనంతరం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నా.. బాలింతకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. జిల్లా ఆస్పత్రి నుంచి HYD గాంధీ ఆసుపత్రికి తరలించగా మరణించింది.
పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ వాసి శంకర్, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న HYDలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రేయసి గమనించి బస్ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 పురపాలికలకు మంచినీటి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.NGKL-రూ.59.79 కోట్లు,WNPT-రూ.128.29 కోట్లు,MBNR-రూ.341.25 కోట్లు, NRPT- రూ.55.57 కోట్లు,GDWL- రూ.89.46 కోట్లు మంజూరయ్యాయి.వేసవిలో భూగర్భ జలాలు ఇంకి తరచూ పట్టణాల్లో తాగు నీటి సమస్య తలెత్తుతోంది.ఈ క్రమంలో అమృత్-2లో సమస్యకు చెక్ పెడుతూ నిధులు విడుదల చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల ప్రధాన పార్టీల లోక్ సభ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. విజయం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్, BJP, BRS పార్టీల ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలడంతో ఉత్కంఠకు తెరపడింది. స్థానికంగా సమీకరణాలు శరవేగంగా మారుతున్న తరుణంలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే పలువురు నేతలు గ్రామాల వారిగా ప్రచారంలో నిమగ్నమయ్యారు.
కారు వెనక్కి తీస్తుండగా చక్రాల కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీను వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్‌కు చెందిన శ్రీను, వసుంధర దంపతులు హైదరాబాదులోని అత్తాపూర్‌లో ఉంటున్నారు. వీరికి తొమ్మిది నెలల పాప ఉంది. అపార్ట్మెంట్‌లోని ఓ వ్యక్తి కారు రివర్స్ తీస్తుండగా, చక్రాల కిందపడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోయిలకొండ మండలంలోని మోదీపూర్ గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి దాక్షాయిని(4)మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. SI రాఘవేందర్ కథనం మేరకు.. దాక్షాయిని కిరాణం దుకాణానికి వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఈక్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు ముందు టైరు పాప పైకి ఎక్కించినట్లు, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
✔MBNR: నేటి నుంచి అలివేలు మంగ బ్రహ్మోత్సవాలు ✔త్రాగునీటి కష్టాలపై అధికారుల ఫోకస్ ✔MBNR:నేడు మహిళా సమైక్య సమావేశం ✔ఉమ్మడి జిల్లాలో ఓటు నమోదుపై నజర్✔పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పర్యటన ✔గద్వాల్, ధరూర్ మండలాలలో కరెంట్ కట్ ✔రంజాన్ వేళలు: ఇఫ్తార్(శని)-6:36, సహార్-(ఆది)-4:58
✔MBNR,NGKL ఎంపీ అభ్యర్థుల ఖరారు.. వ్యూహాలకు కసరత్తు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు ✔పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాల బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మహబూబ్ నగర్ స్థానానికి మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS), వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), డీకే అరుణ(BJP) పోటీ పడుతున్నారు. నాగర్ కర్నూల్ స్థానానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS), మల్లు రవి(కాంగ్రెస్), పి.భరత్ ప్రసాద్(BJP) బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్నారు.
ఈనెల 28న జరిగే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. నారాయణపేట ఎంపిడివో కార్యాలయంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని.. జిల్లాలో మొత్తం 205 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.
♥NGKL:BRS ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
♥సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఉమ్మడి జిల్లా నాయకులు
♥మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం:సంపత్
♥ఎన్నికల కోడ్ ముగిశాకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గృహజ్యోతి అమలు
♥WNPT:మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల రాజీనామాలకు ఆమోదం
♥నాకు ఎలాంటి నోటీసులు రాలేదు:MLA విజయుడు
♥ఉపాధి హామీ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
♥ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు
Sorry, no posts matched your criteria.