India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏప్రిల్ 2న మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల భవనంలో నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే పటిష్ఠ బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏప్రిల్ 4 నాటికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ ముగియనుంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో ఓటర్లు మొదటి, రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లను వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండు, మూడో ప్రాధాన్యత ఓటు వేసినా ఆ ఓటు చెల్లదు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకు గానూ.. 1,437 ఓట్లు పోలయ్యాయి. మ్యాజిక్ ఫిగర్ 720 ఓట్లు. మొదటి ప్రాధాన్యత ఓటుగా 720 ఓట్లు ఎవరికి పోల్ అయితే వారిదే విజయం.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ రెడ్డి విజయంపై ధీమాతో ఉన్నప్పటికీ లోలోపల మాత్రం క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. క్యాంపులకు వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఓటు వేశారా లేదంటే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా అనే అంశంపై నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. విజయం సాధించాలంటే దాదాపు 725 ఓట్లు రావాల్సి ఉంది. ఫలితం కోసం ఏప్రిల్ 2 వరకు ఆగాల్సిందే.
తమ్ముడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న విద్యార్థిని పరీక్షకు హాజరైంది. మరికల్‌కు చెందిన అనూషకు గురువారం పదో తరగతి సైన్స్ పరీక్ష ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమ్ముడు అర్జున్ మృతిచెందాడు. పరీక్షకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉండగా.. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ఓదార్చి అనూషను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చి పరీక్ష రాయించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొంది.
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31తో గడువు ముగియనుంది అని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని కొత్తవారు లేదా రెన్యువల్ చేసుకోని వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెలాఖరు వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించినట్లు అధికారులు వివరించారు.
మండలంలోని వేపూర్‌కు చెందిన CRPF జవాన్ విష్ణు (26) మంగళవారం అర్ధరాత్రి కోల్‌కతా సరిహద్దుల్లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోదరుడు శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. విధి నిర్వహణలో ఉండగా జరిగిన కాల్పుల్లో మృతి చెందాడని అక్కడి హెడ్ క్వార్టర్ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
✔నేడు పాలమూరుకు కిషన్ రెడ్డి రాక ✔అచ్చంపేట:నేటి నుంచి రెండు రోజులు వ్యవసాయ మార్కెట్ బంద్ ✔గద్వాల్, వనపర్తి: పలు గ్రామాలలో కరెంట్ కట్ ✔పలు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల పర్యటన ✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలు ✔నవాబుపేట: నేటి నుంచి మలక్ షా బాబా ఉర్సు ప్రారంభం ✔నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(శుక్ర)-6:35,సహర్(శని):4:50 ✔త్రాగు నీరు, ఉపాధి హామీ పనులపై అధికారుల ఫోకస్
ఓ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన యువకుడిని కొత్తకోట పోలీసులు జైలుకు పంపించారు. SI మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాటవెల్లికి చెందిన ఓ బాలికను వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కాగా బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 1,439 ఓట్లకు, 1,437 మంది సద్వినియోగం చేసుకున్నారు. ఇద్దరూ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్ గోడు బీజేపీ ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర అనారోగ్యం కారణంగా, నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్ల సర్వ ఎంపీటీసీ సభ్యురాలు శారద అమెరికాలో ఉండటంతో ఓటుహక్కును వినియోగించుకోలేదు.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికల యుద్ధం నడిచించి. అయితే లెక్క ప్రకారం వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌కు ఉండగా.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.