Mahbubnagar

News March 25, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన BRS నేత శివకుమార్

image

మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News March 25, 2024

MLC ఉపఎన్నికలో పాల్గొనే అధికారులకు కలెక్టర్ సూచనలు

image

✓ ఉపఎన్నిక EVMల ద్వారా కాకుండా బ్యాలెట్‌ విధానంలో ఉంటుంది.
✓ బ్యాలెట్‌ బాక్స్‌ ఖాళీగా ఉందని అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు చూపాలి.
✓ బ్యాలెట్‌ బాక్సులు ఓపెన్‌ చేయడం, మూసివేయడం, సీలింగ్‌ చేసే పద్ధతి గురించి తెలుసుకోవాలి.
✓ బ్యాలెట్‌ పేపర్‌ మడత పెట్టడంపై అవగాహన కలిగి ఉండాలి.
✓ పోలింగ్‌ కేంద్రంలోకి ఒకేసారి నలుగురు ఓటర్లను మాత్రమే అనుమతి.
✓ ఓటర్లు 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపినా అనుమతించాలి.

News March 25, 2024

రంగుల హోళీ.. సంతోషాల కేళి

image

హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా పెద్దా అంతా రంగుల్లో మునిగి తేలే పండుగ. వసంతకాలం వేడుక. పల్లె పట్నం అంతా ఎల్లలు దాటేలా సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా ఆలయాలుముంగిళ్లు, వాకిళ్లు రంగులతో తడిసి మురిసే సంబరం. ప్రకృతి ప్రసాదించిన సహజ రంగులతో హోళీ ఆడుకుందాం సంతోషాల సంబరాలను జరుపుకుందాం.  >>HAPPY HOLI

News March 24, 2024

ఉమ్మడి జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలు, రోడ్షోలు, సమావేశాలు ఏర్పాటు విషయమై చర్చించామని నేతలు తెలిపారు. పాలమూరు మహాసభకు రాహుల్ గాంధీ ఆహ్వానించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పార్టీ నేతలు పాల్గొన్నారు.

News March 24, 2024

MBNR: కిషన్ రెడ్డి సమక్షంలో చేరిన విష్ణువర్ధన్ రెడ్డి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ నాయకుడు మెట్టు కాడి శ్రీనివాస్, పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులకు పార్టీ కండువా చేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి డీకే అరుణ తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.

News March 24, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒రేపే హోలీ.. ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి: ఉమ్మడి జిల్లా పోలీసులు
✒NGKL: వేడినూనె మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి
✒CONGRESS, BJPలలో భారీ చేరికలు
✒SDNR:RTC బస్సులో రూ.16,50 లక్షల నగదు, వెండి సీజ్
✒NRPT:పత్తి మిల్లు దగ్ధం.. రూ.8 కోట్ల ఆస్తి నష్టం
✒MBNR:MLC ఉప ఎన్నిక.. గోవాకి వెళ్లిన ప్రజాప్రతినిధులు
✒‘టెట్ దరఖాస్తు రుసుం తగ్గించండి’.. పలుచోట్ల నిరసన
✒ఉమ్మడి జిల్లాలో జోరందుకున్న MP అభ్యర్థుల ప్రచారం

News March 24, 2024

కొందుర్గు: లారీ ఢీకొని ఒకరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కొందుర్గు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చెక్కలోనిగూడెం గ్రామానికి చెందిన రామచంద్రయ్య(54) టీవీఎస్ వాహనంపై కొందుర్గు వైపు వెళ్తుండగా గొర్రెలు అడ్డు వచ్చాయి. గొర్రెలు తప్పించే ప్రయత్నంలో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 24, 2024

NGKL: వేడినూనె మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి

image

ఆమనగల్లులో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ బలరాం తెలిపిన వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లికి చెందిన అర్జున్.. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బ్రహ్మోత్సవాల సందర్భంగా తినుబండారాల దుకాణం ఏర్పాటు చేశాడు. అయితే దుకాణానికి అతడితో పాటు వచ్చిన కుమారుడు జయదేవ్(3) అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వేడి నూనె ఒంటిపై పడింది. చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం మృతిచెందాడని ఎస్ఐ తెలిపారు.

News March 24, 2024

MBNR: వారం రోజుల్లో ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కే !

image

ఉమ్మడి జిల్లాలో 3,068కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, 55 ఎమ్మార్సీలు, 208 సీఆర్సీలున్నాయి. వీటికి మొదటి విడతలో రూ.5.54 కోట్లు, రెండో విడతగా రూ.5.54 కోట్ల నిధులు వచ్చాయి. ఈ నిధులను వారం రోజుల్లో మార్చి 31 నాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేదంటే వెనక్కి వెళ్లిపోతాయి. స్టేషనరీ, పాఠశాల మరమ్మతులు, రంగులు వేయడానికి, ప్రయోగాలు, ఆటలు ఆడించేందుకు తదితర వాటి కోసం నిధులను ఉపయోగించి బిల్లులు అప్ లోడ్ చేయాల్సి ఉంది.

News March 24, 2024

మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
>>>SHARE IT