India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్‌లో ప్రధానంగా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేశారు. మొత్తం 8,04,641 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా అందులో 5,34,150 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీరందక సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న, మొత్తం 91,357 ఎకరాల్లో పంటలు ఎండినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎండ తీవ్రతకు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతల కారణంగా అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అచ్చంపేట మండలం అయినోలులో 40.7 డిగ్రీలు నమోదు కాగా, బిజినేపల్లి మండలంలో 40.5 నమోదయ్యాయి.
మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామ సమీపంలో ని బసవేశ్వర కాటన్ మిల్లులో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పక్కన ఉన్న రైస్ మిల్లు కార్మికులు గమనించి యజమానికి, పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అర్పివేశారు. షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాదంలో సుమారు 8 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు మిల్లు యజమాని తెలిపారు.
ఈనెల 28న జరగనున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపుపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు MPTCలు, ZPTCలు, మున్సిపల్ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. గత పదేళ్ల BRS పాలనపై వ్యతిరేకతతో కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని ఆ పార్టీకి చెందిన నాయకులు ధీమాతో ఉన్నారు. BRS నాయకులు సైతం గెలుపు మాదే అని చెబుతున్నారు.
కేశంపేట మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో పదోతరగతి పరీక్ష శనివారం జరిగింది. కానిస్టేబుల్ వివరాల ప్రకారం.. నిడదవెళ్లి గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ టీచర్ పరీక్ష కేంద్రానికి కార్‌లో వెళ్లాడు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అడ్డుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రం సీఎస్ నర్సింహులు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ కృష్ణయ్యలను విధుల నుంచి తప్పించారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 28న జరగనున్న సందర్భంగా కాంగ్రెస్, BRS పార్టీ అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మారిన రాజకీయ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందిన దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్ పేట మండలాలకు చెందిన BRS ప్రజా ప్రతినిధులు ఇటీవల రెండు ప్రైవేటు బస్సుల్లో గోవా శిబిరానికి తరలి వెళ్లారు.
✔వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలలోని పలు మండలాలలో కరెంటు కట్
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న క్షయ వ్యాధి సర్వే
✔NRPT:నేడు ‘రజాకార్’ సినిమా ప్రదర్శన ✔నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(SUN):6:35, జోహార్(MON):4:56 ✔పలు నియోజకవర్గలో స్థానిక MLAల పర్యటన ✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు ✔MBNR:హోలీ..ప్రత్యేక రైళ్లు ✔ఎన్నికల కోడ్.. కొనసాగుతున్న తనిఖీలు ✔DSC(SA) ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
బావిలో ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. దేవేందర్ గౌడ్, జయలక్ష్మి దంపతుల కుమారుడు భూపతి గౌడ్(17) ఇంటర్ పరీక్షలు ముగియగా.. ఖాళీగా ఉన్నాడు. ఓ బావిలో ఈత కొడుతుండగా.. పూడికలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. 2022లో జిల్లాలో క్షయ బాధితులు 7,187 మంది ఉండగా.. 2024లో ఇప్పటి వరకు 8,612 మంది రోగులు నమోదయ్యారు. ఒక్క ఏడాదిలోనే వారి సంఖ్య 1,425 మంది పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో 80 శాతం కేసులు వస్తుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 20 శాతం మంది చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 క్షయ యూనిట్ల ఆసుపత్రులు ఉన్నాయి.
ఓ మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. SP వివరాల ప్రకారం.. తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన లలిత(40) భర్త చనిపోయి ఒంటరిగా ఉంటుంది. లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన శివుడుతో పరిచయం ఏర్పడింది. ఈనెల 13న బల్మూరు మండలం మైలారం గ్రామ శివారులో ఇద్దరు కలిసి మద్యం తాగారు. శివుడు తాగిన మైకంలో ఆమెను హత్య చేసి నగలు దోచుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించారు.
Sorry, no posts matched your criteria.