Mahbubnagar

News October 6, 2024

NGKL: జీతాలు చెల్లించండి రేవంత్ సారూ..!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ జీతాలు చెల్లించాలని సీఎం రేంవత్ రెడ్డిని వేడుకుంటున్నారు. రెండు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. జీతాలు రాక ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే.. ఇక బతుకమ్మ పండుగ ఎలా చేసుకోవాలని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దసరా పండుగ సమీపిస్తుంన్నందున ప్రభుత్వం స్పందించి తమ జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

News October 6, 2024

గద్వాల: మెడిసిన్ సీటు సాధించిన పేదింటి బిడ్డ

image

గద్వాల ఎర్రమట్టి వీధికి చెందిన పావని జమ్మన్న దంపతుల కూతురు వైష్ణవి మెడిసిన్‌లో సీటు సాధించింది. విషయం తెలుసుకున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆదివారం వారి ఇంటికి వెళ్లి సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పేదింటి బిడ్డలు చదువులో రాణించి అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కన్వీనర్ బుచ్చిబాబు పాల్గొన్నారు.

News October 6, 2024

NGKL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పర్యాటక టూర్లు

image

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పురాతన గుడులు
పర్యటక ప్రదేశాలను చూపించనున్నారు. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా 2,4 తరగతుల ఒక్కో విద్యార్థికి రూ.300/- 5, 8 తరగతుల వారికి రూ.800/-, 9,ఇంటర్, వారికి రూ.2000/-డిగ్రీ విద్యార్థులకు రూ.4000/-చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించడం జరుగుతుంది. 3వేల విద్యార్థులకు అవకాశం దక్కనుందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు వెల్లడించారు.

News October 6, 2024

జూరాలలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి

image

జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది. శనివారం ఎగువలో 5 యూనిట్ల ద్వారా 196 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ సూరిబాబు తెలిపారు.
ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 442.534 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు.

News October 6, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పడిపోయిన ఉల్లి సాగు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,600 ఎకరాల్లో సాగయ్యే ఉల్లి పంట ఈ సారి 1,200 ఎకరాలకు పడిపోయింది. గత ఏడాది ఉల్లి సాగు చేసిన రైతులకు సరైన గిట్టుబాటు ధర దొరకకపోవడంతో ఈ ఏడాది సాగు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఉల్లి కొరత ఏర్పడి ధర పెరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో సాగు చేసిన కొద్దిపాటి ఉల్లి పంట కూడా దెబ్బతింది. క్వింటా ఉల్లి ధర జూలైలో రూ.2 వేలు ఉండగా.. సెప్టెంబరులో రూ.5,600 లకు పెరిగింది.

News October 6, 2024

పాలమూరు జిల్లాకు ఎల్లో అలర్ట్⚠️

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

News October 6, 2024

MBNR: ‘తెలంగాణ వచ్చి పదేళ్లు దాటిన కేసులో మాఫీ కాలే’

image

రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినప్పటికీ ఉద్యమంలో నమోదైన కేసులు ఇప్పటికి మాఫీ కాలేదని మహబూబ్ నగర్ టీఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సకల జనుల సమ్మె సందర్భంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఉద్యమకారులపై కేసులు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు.

News October 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✒ఘనంగా బతుకమ్మ సంబరాలు
✒U-19 టోర్నీ.. ఫైనల్లో పాలమూరు ఓటమి
✒కొల్లాపూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✒దుర్గామాతకు ప్రత్యేక పూజలు
✒మంత్రి సురేఖ మాటలు ముమ్మాటికీ తప్పే:DK అరుణ
✒మన్ననూరులో గద్దర్ విగ్రవిష్కరణ
✒వనపర్తి: లిఫ్టు కాలువలో పడి వ్యక్తి మృతి
✒కోస్గి:ముగిసిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
✒ధన్వాడ: చిరుత దాడిలో జింక మృతి
✒కురుమూర్తి బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక ఫోకస్

News October 5, 2024

కల్వకుర్తి: సూర్య ప్రకాశ్ రావును అభినందించిన కేటీఆర్

image

కల్వకుర్తి పట్టణ సమీపంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో ఇటీవల జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సూర్య ప్రకాశ్ రావును మాజీ మంత్రి కేటీఆర్ శనివారం అభినందించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి వారు కేటీఆర్‌ను కలిశారు.

News October 5, 2024

కొడంగల్: DSC ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 5వ, జిల్లాస్థాయిలో 3వ ర్యాంక్

image

కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని గుండ్లకుంటకు చెందిన తిరుమలేశ్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు జిల్లాస్థాయిలో 3వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.