Mahbubnagar

News March 20, 2024

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు స్వాగతం.. శ్రీనివాస్ గౌడ్

image

బహుజన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు BRSలో చేరిన సందర్భంగా స్వాగతం పలుకుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRSలో బహుజన నాయకత్వం బలంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. కొందరు BRS పార్టీలో లాభం పొంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారని మండిపడ్డారు.

News March 20, 2024

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి: కలెక్టర్ సంతోష్

image

లోక్ సభ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సరిహద్దు లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట నిఘా పెట్టి తనిఖీ చేయాలన్నారు. నగదు మద్యం అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. సీ విజిల్ యాప్ ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు.

News March 20, 2024

MBNR: పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ సభలు

image

ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్, BJP విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో CM రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ MBNR, NGKL స్థానాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపిస్తే పాలమూరుకు ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. తాజాగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లో విజయ్ సంకల్ప్ సభలో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

News March 19, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥పార్టీ వీడే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
♥NGKL:ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
♥అడ్డాకుల:కుక్కలను కాల్చి చంపిన ముగ్గురి అరెస్ట్
♥WNPT:మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ రాజీనామా
♥NGKL:ఏడుగురు విద్యార్థులపై పిచ్చికుక్కల దాడి
♥పాల శీతలీకరణ కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలి:NRPT కలెక్టర్
♥ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వాన చినుకులు
♥ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాలు

News March 19, 2024

నాగం జనార్ధన్ రెడ్డిని కలిసిన ఆర్ఎస్పీ

image

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు నాగం జనార్ధన్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ పరిస్థితులపై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో M.C కేశవ రావు, కనకం బాబు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News March 19, 2024

అడ్డాకుల: కుక్కలను కాల్చి చంపిన ముగ్గురి అరెస్ట్

image

అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో కుక్కలను కాల్చి చంపిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నడంతో గ్రామానికి చెందిన పలువురు ఈనెల 15న దాదాపు 20 కుక్కలను కాల్చి చంపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో నేడు నిందితులు నర్సింహారెడ్డి, తారిఖ్ అహ్మద్, మహమూద్ తాహీర్‌ను అరెస్ట్ చేశారు.

News March 19, 2024

గుండెపోటుతో గద్వాల వాసి మృతి

image

గద్వాల పట్టణానికి చెందిన వ్యాపారవేత్త మాక ప్రవీణ్ కుమార్ మంగళవారం గుండెపోటుకు గురై హైదరాబాదులో మృతి చెందాడు. కుటుంబీకుల వివరాలు.. వ్యాపారం నిమిత్తం భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ఆయన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమంలో దుకాణంలో గుండెపోటుకు గురయ్యాడు. దుకాణదారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గద్వాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 19, 2024

MBNR: పార్టీల బలాబలాలు తారుమారు.. !

image

MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీల బలాబలాలు తారుమారు అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 1439 ఓట్లు ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు 800 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పలువురు ఎంపీటీసీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోతున్నాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని జిల్లాలో చర్చ సాగుతోంది.

News March 19, 2024

ఉమ్మడి జిల్లాకు వాతావరణ శాఖ చల్లటి కబురు

image

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి పలుచోట్ల నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇటీవల ఎండ వేడి మీతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News March 19, 2024

BREAKING.. MBNR: ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ఆత్మహత్యాయత్నం

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా చేస్తున్న శంకర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. శంకర్‌ను కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.