India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. పట్టణంలోని బీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన బిహార్‌కి చెందిన రాషద్ ఖాన్ రూం రెంట్‌కి తీసుకుని ఉంటున్నాడు. కాగా, సోమవారం బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న సీఐ కమలాకర్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. నసురుల్లాబాద్ శివారులోని మూలమలుపు వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి MBNR జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వివరాలిలా.. కొత్తకోటకు చెందిన చరణ్‌రెడ్డి, అనిల్ HYDకి వెళ్తూ బైక్ అదుపు తప్పి మృతిచెందారు. కొత్తపల్లి మండలం నిడ్జింతతండాలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో మద్దూరుకు చెందిన రాములు చనిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకెళ్తుండగా బొలెరో వాహనం వారి బైక్‌ను ఢీకొనడంతో వడ్డేపల్లి మండల వాసి మురళి స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మూసాపేట్ మండల పరిధిలోని గాజులపేట సమీపంలో జాతీయ రహదారిపై కొత్తకోట, మదనాపూర్ గ్రామాలకు చెందిన చరణ్ (25), అనిల్ (22) బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో గాజులపేట సమీపంలో రహదారిపై వంతెన గోడకు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్థలాన్ని భూత్పూర్ సీఐ రామకృష్ణ పరిశీలించారు.
MBNR జిల్లా వ్యాప్తంగా ఆర్థిక వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ప్రజల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రుణాలను ప్రభుత్వ సంస్థల ద్వారానే తీసుకోవాలని, ప్రవేట్ సంస్థల్లో తీసుకొని అధిక వడ్డీ బారిన పడకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ సూచించారు.
ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు వెనుక టైరు పగిలి మంటలు అంటున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేశారు. కాగా, బస్సులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు దగ్ధం అయింది.
ఉరేసుకుని నర్సింగ్ <<15558418>>విద్యార్థి <<>>ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నకూతురు సింధు(17) షాద్‌నగర్‌లో నర్సింగ్ చదువుతోంది. కాగా, ఆదివారం రెండో అక్కతో సింధుకి గొడవైంది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఉరేసుకొని నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు నలుగురు కూతుర్లు. వీరు జీవనోపాధి కోసం బాలానగర్‌కి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణయ్య చిన్న కూతురు సింధుజ (17) ఉరేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కల్వకుర్తిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్న అనూష(20) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థి ఆమె ప్రేమించుకుంటున్నారు. కాగా.. మంగళవారం సదరు విద్యార్థితో అనూష ఫోన్ మాట్లాడిన అనంతరం పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోస్టుమార్టంలో యువతి గర్భందాల్చినట్లు ఆరోపణలున్నాయి. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.