India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గద్వాల మండలంలోని సంగాల చెరువులో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నీటిలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో ప్రతి చెరువుకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
వానా కాలంలో రైతులు సాగుచేసిన వరి పంట కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నాగర్ కర్నూల్‌లో 244, నారాయణపేటలో 95 జోగులాంబ గద్వాలలో 55, వనపర్తిలో 244, మహబూబ్‌నగర్లో 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్టూరులో 84.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 37.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా మల్దకల్లో 36.8 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా దోనూరులో 30.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మాగనూరులో 26.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
అయిజ మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ ప్రాంతాలకు నేడు తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలోని పాత పోలీస్ స్టేషన్ భవనం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యిందని, దానికి మరమ్మతు చేసి కాంక్రీట్ వేశారని, దీంతో శుక్రవారం పాత బస్టాండ్ కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను నిలిపేస్తున్నట్లు చెప్పారు.
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌కు గురువారం వివిధ గ్రామాల నుంచి 23 మంది రైతులు 418 క్వింటాళ్ల మొక్కజొన్నను అమ్మకానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం వరకు టెండర్ ప్రక్రియ పూర్తవ్వగా.. గరిష్ఠంగా రూ.2,439, కనిష్ఠంగా రూ.1,969, సగటున రూ.2,437 ధరలు వచ్చాయి. ఈ క్రమంలోనే భారీ వర్షం పడటంతో మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. సుమారు 200 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం తడిసిపోయిందని అంచనా.
స్థానిక ఎన్నికల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 23,22,054 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 11,54,128 మంది ఉండగా..11,67,893 మంది మహిళలు, 33 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 13,765 మంది అధికంగా ఉన్నారు.
1.మహబూబ్ నగర్- 5,16,183
2.నాగర్ కర్నూల్- 6,46,407
3.నారాయణపేట- 4,03,748
4.గద్వాల్- 3,88,195
5.వనపర్తి- 3,67,521
కొడంగల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ డీఎస్సీ ఫలితాల్లో రాష్ట్రంలో సోషల్ స్టడీస్‌లో 2వ ర్యాంక్, VKB జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అదే విధంగా ఇటీవలే గురుకుల ఫలితాలలో టీజీటీ, పీజీటీ, హాస్టల్ వార్డెన్ ఉద్యోగంతో సత్తా చాటాడు. 4 ఉద్యోగాలు సాధించి నిరుద్యోగ యువకులకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.
దసరా సెలవులకు వేరే వుళ్లకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. ఇళ్లకు బలమైన తాళాలు వేయాలని, ఇళ్లలో విలువైన ఆభరణాలు, డబ్బులు వుంచారదని, ఇంటి బయట 24 గంటలు లైట్లు వెలిగేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదన్నారు. పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రయాణాలు చేసే సమయంలో దొంగలు చేతివాటం చూపుతారని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని అన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నవ రాత్రులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంట్లోనే కాక, వీధుల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారు నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత శైలపుత్రిగా దర్శనిమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కట్టుపొంగలి, చవివిడి,వడపప్పు ప్రసాదంగా పెడతారు. 6వ రోజున వేడుకలు, పూజలు ప్రారంభమవుతాయి. తరువాతి మూడు రోజులలో దుర్గ, లక్ష్మి, సరస్వతి వివిధ రూపాలలో పూజిస్తారు.
వనపర్తి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రాకేష్ హైదరాబాద్ గణేష్ బందోబస్తుకు వెళ్లి విధుల్లో చేరకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం సీసీఏ రూల్స్‌కు విరుద్ధమని సస్పెండ్ చేశారు. పానగల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రామకృష్ణ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుతో సస్పెండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.