Mahbubnagar

News April 17, 2025

MBNR: కార్మిక చట్టాలు నిర్వీర్యం: సీఐటీయూ 

image

మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి ఏప్రిల్ 22న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి కురుమూర్తి తెలిపారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, అధిక ధరలు తగ్గించి, కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.

News April 17, 2025

భూత్పూరు: సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు

image

జిల్లా ఎస్పీ డీ.జానకి ఆదేశాల మేరకు భూత్పూర్ మండల పరిధిలోని సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ యశ్వంత్ రావు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా సీడ్ ప్రాసెసింగ్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విత్తన శుద్ధి, ప్యాకింగ్ ,గోదాముల నిర్వహణ వంటి అంశాల్లో పూర్తి సమీక్ష జరిపామని తెలిపారు.

News April 17, 2025

MBNR: బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు: సీనియర్ సివిల్ జడ్జి

image

నేరం జరుగుతున్నప్పుడు చూసి తనకెందుకులే అని సాక్ష్యం చెప్పకపోయినా నేరస్థులే అవుతారని జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. చిన్నచింతకుంట ఎంపీడీవో ఆవరణలో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, బాల కార్మిక చట్ట నివారణ, బాలల సంరక్షణపై నిర్లక్ష్యాన్ని విడనాడాలని సూచించారు. నేరాల అదుపునకు చట్టాలతో పాటు బాధ్యతలు కూడా అంతే ముఖ్యమన్నారు.

News April 17, 2025

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేటి పంట ఉత్పత్తుల ధరలు..!

image

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 190 మంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు. వేరుశనగలు 164 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.6,639, కనిష్ఠ ధర రూ.5,241 లభించింది. మొక్కజొన్న 2,474 క్వింటాలు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,251, కనిష్ఠ ధర రూ.2259, కనిష్ఠ ధర రూ.1,681 లభించింది. వడ్లు ఆర్ఎన్ఆర్ 2004 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ.2,306 లభించింది.

News April 17, 2025

MBNR: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుదాం: ఫైర్ స్టేషన్ ఆఫీసర్

image

వేసవికాలంలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని మహబూబ్‌నగర్ అగ్నిమాపక శాఖ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మల్లికార్జున్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గృహాలు, హాస్పిటల్స్, పాఠశాలలు, కర్మాగారాల్లో ప్రమాదాలు, వరదలు, రోడ్డు, రైలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖ నంబర్ 101కు సమాచారం అందించాలన్నారు.

News April 17, 2025

నాగర్‌కర్నూల్: తల్లిదండ్రులు మృతి.. అనాథలుగా పిల్లలు..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన చిన్నారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి గుండాల కుమార్ మృతిచెందగా, అప్పటి నుంచి కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్న తల్లి దేవి ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందింది. అనాథలుగా మారిన ఆ పిల్లలు ‘అమ్మానాన్న’ కావాలంటూ విలపిస్తున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News April 17, 2025

మహబూబ్‌నగర్: ‘ఈనెల 17 నుంచి 29 వరకు అవగాహన కార్యక్రమాలు’

image

ఈనెల 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పథకంపై అవగాహన కార్యక్రమాలను మండలాల వారీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. ముందుగా గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జడ్చర్లలో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు.

News April 17, 2025

SUPER.. గిన్నిస్ రికార్డ్ కొట్టిన మహబూబ్‌నగర్ అమ్మాయి 

image

మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన టి.సత్యం గౌడ్, పుష్పలత దంపతుల కుమార్తె టి.హన్సికకు ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన కూచిపూడి ప్రదర్శనలో కనబరిచిన ప్రతిభకు గాను, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా స్థానిక ఎంజే ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ వారు విద్యార్థినిని శాలువాతో సత్కరించారు. ప్రతి విద్యార్థి చదువులోనే కాకుండా ప్రతి రంగంలో రాణించాలని, ఇలాంటి సత్కారాలు ఎన్నో అందుకోవాలని సూచించారు. 

News April 17, 2025

మహబూబ్‌నగర్: అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి – 2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ‘భూ భారతి’ భూమి హక్కుల రికార్డు – 2025 చట్టంపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

News April 17, 2025

వడదెబ్బ నుంచి కూలీలను కాపాడాలి: మహబూబ్‌నగర్ కలెక్టర్

image

వేసవి దృష్టిలో పెట్టుకుని ఉపాధి పథకం కూలీలు వడదెబ్బకు గురికాకుండా వారిని అన్ని విధాలుగా కాపాడాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర పోయి అధికారులను ఆదేశించారు. బుధవారం హన్వాడలో కొనసాగుతున్న ఉపాధి పనులను ఆమె తనిఖీ చేసి కూలీలతో కాసేపు మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవి ముగిసే వరకు కూలీలకు పనిచేసే దగ్గర టెంటు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు నీటిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.