India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆస్తి కోసం తండ్రి మృతదేహానికి కన్న కొడుకు తలకొరివి పెట్టకపోవడంతో చివరకు చిన్న కూతురు పెట్టింది. ఈ ఘటన బుధవారం MBNR పద్మావతి కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీ వాసి మాణిక్యరావు మృతిచెందారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరుగుతుండగా తలకొరివి పెట్టాల్సిన కుమారుడు రూ.కోటి విలువ చేసే ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తలకొరివి పెడతాననడంతో చివరకు బంధువుల సూచనతో చిన్నకూతురు తలకొరివి పెట్టింది.

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి బుధవారం పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెలవారి నేర సమీక్ష, గ్రేవ్, నాన్ గ్రేవ్, యూఐ కేసులు, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసులు, మహిళలపై నేరాలు, దొంగతనాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, అరెస్టులు వంటి అంశాలు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు.

రానున్న పోటీ పరీక్షల సన్నద్ధం చేసేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిరుద్యోగులకు జిల్లా కేంద్రంలో బుధవారం ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, టెట్, వీఆర్ఏ డీఎస్సీ, తదితర పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందివ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

✔నీళ్లతో రాజకీయం చేయడం BRSకు తగదు: మక్తల్ ఎమ్మెల్యే✔రైల్వే అధికారులతో ఎంపీ డీకే అరుణ సమీక్ష✔అకాల వర్షం.. దెబ్బతిన్న పంటలు✔GDWL:ఈడ్చుకెళ్లిన ట్రాక్టర్..మహిళ మృతి ✔భూభారతిపై అవగాహన కలిగి ఉండాలి:కలెక్టర్లు✔పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం✔‘రజతోత్సవ సభకు తరలిరండి’:BRS✔MBNR: ఉచిత శిక్షణ ప్రారంభం ✔పలుచోట్ల డ్రగ్ అండ్ డ్రైవ్

పోలీసులు ప్రతి కేసును కూడా పారదర్శకంగా విచారణ చేపట్టాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సర్కిళ్ల వారీగా నమోదైన నేరాల విషయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిందితులకు శిక్ష శాతాన్ని పెంచేందుకు పగడ్బందీగా విచారణ చేపట్టాలన్నారు. విచారణ జరగకుండా నిలిచిపోయిన కేసుల గురించి ఎస్పీ ఆరా తీసి కారణాలు అడిగి తెలుసుకున్నారు.

ఉచిత కోచింగ్ సెంటర్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అంబేడ్కర్ కళాభవన్‌లో తన సొంత నిధులతో నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో HYDకు దీటుగా కోచింగ్ ఇప్పిస్తున్నామన్నారు. కోచింగ్‌కు వచ్చే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి మంచి స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా ఇస్తామన్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి<<>> వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్‌పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లి గ్రామ శివారులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాలలో ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. నిన్న సాయంత్రం శివరాములు మృతదేహం లభ్యం కాగా.. బుధవారం ఉదయం యాదయ్య (25) మృతదేహం లభ్యమయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి తీవ్రత రోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో కౌకుంట్ల 40.6 డిగ్రీలు, దేవరకద్ర 40.5 డిగ్రీలు, అడ్డాకుల, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 40.1 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లిలో 40.0 డిగ్రీలు, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 39.8 డిగ్రీలు, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 39.4 డిగ్రీలు, మూసాపేట మండలం జానంపేట 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

మూసాపేట మండలంలో ఓ చిరువ్యాపారి నిర్వహిస్తున్న డబ్బా మీద పడి మహిళ మృతి చెందారు. స్థానికుల వివరాలు.. వేముల గ్రామ శివారులోని ఓ కంపెనీ దగ్గర ఓ వ్యాపారి కిరాణా డబ్బాను నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా ఆ కంపెనీ దగ్గర అయ్యమ్మ(75) వరి ధాన్యాన్ని అరబెట్టుకుంటూ ఉండేది. నిన్న సాయంత్రం కురిసిన గాలివానకు ఆమె ఆ డబ్బా దగ్గర తలదాచుకుంది. ప్రమాదవశాత్తు ఆ డబ్బా ఆమె మీద పడటంతో అయ్యమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.
Sorry, no posts matched your criteria.