India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఎస్‌ఎల్‌బీసీ ఎడమగట్టు కాలువ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో అనేక మంది కార్మికులు గాయాలపాలు కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులను పునఃప్రారంభం చేశారు. ఇంతలోనే ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
రాష్ట్రంలో మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నారాయణపేటలో లాంఛనంగా ప్రారంభించారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లి గ్రామంలో దళిత మహిళ బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేసి.. ఇండ్ల నిర్మాణానికి పత్రాలను గ్రామ మహిళలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రెడ్డిని కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
✔మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలకు చేర్పింలి: కలెక్టర్లు
✔పాలమూరులో భారీ అగ్నిప్రమాదం
✔రైతు భరోసాకే దిక్కులేదు.. ఇండ్లు ఎలా ఇస్తారు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✔ఘనంగా అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం
✔GDWL:AP పోలీసులు దౌర్జన్యం చేశారు:BRS
✔ప్రపంచం సోషలిజం వైపు చూస్తోంది:CPM
✔NRPT: మహిళా పెట్రోల్ బంకును ప్రారంభించిన సీఎం
✔హామీలపై(BRS,BJP) చర్చకు సిద్ధమా:CM రేవంత్‌రెడ్డి
ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. బొల్లారానికి చెందిన శ్రీనివాస్ గౌడ్(50) భార్య పిల్లలతో కలిసి MBNRలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం బంధువు ఒకరు చనిపోవటంతో శ్రీనివాస్ గ్రామానికి వచ్చారు. కాగా.. కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో విరక్తి చెంది తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మహమ్మదాబాద్ మండలంలో ఓ యువకుడు కుటుంబ సమస్యల కారణంగా గొంతు కోసుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. చౌదర్‌పల్లికి చెందిన ఖాసీం ఇంట్లో గొడవల కారణంగా మనస్తాపానికి గురై బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
తాడూరు మండల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తెలకపల్లి మండలం అనంతసాగర్‌కి చెందిన శ్రీను(42), శేఖర్(30)లు బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నారు. వీరి బైక్‌ని తాడురు సమీపంలోని గుంతకోడూరులో ఓ కారు ఢీకొనగా.. ఇద్దరు కిందపడ్డారు. వీరి పైనుంచి ఆ కారు వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు.
సీఎం రేవంత్ రెడ్డి నేడు (శుక్రవారం) కొడంగల్ నియోజకవర్గం, నారాయణపేటలో పర్యటించనున్నారు.12 గంటలకు దుద్యాల మండలం పోలేపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి, భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం రాకతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సీఎం రేవంత్ నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.
జిల్లాలో ఆహార భద్రత పట్ల పకడ్బందీగా దృష్టి సారిస్తున్నారని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీ అనంతరం కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరుని పరిశీలించారు. ఆహార భద్రత పకడ్బందీగా కొనసాగుతుందని అధికారులను అభినందించారు.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్టీ మోర్చ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంత్ సేవాలాల్ భోగ్ బండార్ హోమం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల ఆరాధ్య దైవం, హిందూ ధర్మ పరిరక్షకుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని అన్నారు. సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి 15న దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని పార్లమెంట్లో తెలిపినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.