India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు మహబూబ్‌నగర్ చదువుల కేంద్రం కావాలి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పంచవటి విద్యాలయ 21వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకోవడానికి మన మహబూబ్‌నగర్‌కే రావాలన్నారు. పంచవటి విద్యాలయ యాజమాన్యం విద్యా నిధికి రూ.5 లక్షలు అందజేశారు.
మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయం నిర్వహణ అధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.32,39,301 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన తిమ్మాజీపేట మండలంలో జరిగింది. ఎస్ఐ ప్రకారం.. భూత్పూర్ మండలం భట్టుపల్లితండాకు చెందిన సంధ్య(23)కు గొరిటతండా వాసి జగన్‌తో పెళ్లైంది. అదనపు కట్నం కోసం భార్యను తరచూ వేధించేవాడు. కాగా, మంగళవారం రాత్రి సంధ్య చనిపోయిందంటూ తండావాసులు తల్లికి సమాచారం అందించారు. అదనపు కట్నం కోసమే తన కూతురిని హత్య చేశారంటూ తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సీఎం రానుండటంతో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం కొందుర్గ్‌లో శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు, శివాజీ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమార్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్‌ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.
పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
ప్రేమ పేరుతో ఓ బాలికను మోసంచేసి తల్లిని చేసిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. భూత్పూర్ మం. కొత్తమూల్గరకు చెందిన ఎండీ జాఫర్(33) RTCలో అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఓ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని నిలదీయగా.. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాలిక పోలీసులను నిన్న ఆశ్రయించింది. ప్రస్తుతం బాలికకు తొమ్మిదినెలల కుమారుడు ఉన్నాడు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు “SBI, SBRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ G.శ్రీనివాస్ తెలిపారు. Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. ఎంబ్రాయిడరీ డిజైన్ లలో ఈనెల 24 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలని, 19-45 సం.లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.
ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుళ్లు పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఒక కేసు విషయంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహులు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.