India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో నుంచి సైబర్ నేరస్థులు నగదు కాజేసిన ఘటన MBNR జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగికి ఫోన్ చేసి ‘నీపై స్టేషన్లో కేసు నమోదైంది.. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తాం.’ అని అనటంతో ఉద్యోగి నమ్మి రూ.90వేలు వారికి పంపించారు. తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మరో ఇద్దరి వ్యక్తుల నుంచి సైతం సుమారు రూ.62వేలను దోచుకున్నారు.
వరి పంటకు మందు స్ప్రే చేసే డ్రోన్ తగిలి ఓ రైతు గాయాలపాలైన ఘటన అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే రాచాల గ్రామానికి చెందిన రైతు దండు ఆంజనేయులు వరి పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పంటకు మందు స్ప్రే చేయడానికి డ్రోన్ వాడుతున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు డ్రోన్ తగిలి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
జిల్లా కలెక్టరేట్లోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హెచ్చరించారు. సోమవారం తన ఛాంబర్ లో బయోమెట్రిక్ విధానం పై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ ను పాటించాల్సిందేనని, అలా కాకుండా గైర్హాజర్ అయితే వారిని సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు బయోమెట్రిక్పై ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు డిప్యూటీ తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ విజయేంద్రి బోయి బదిలీ చేశారు. జడ్చర్ల డీటీగా పనిచేస్తున్న రాజీవ్ రెడ్డి ని కలెక్టరేట్లోని డీఎస్ఓ డీటీగా నియమించగా, డీఎస్ఓ లో డీటీలుగా పనిచేస్తున్న శ్యాంసుందర్ రెడ్డిని మహబూబ్నగర్ రూరల్ డీటీగా, ఈయనతో పాటు కిషోర్ ని జడ్చర్ల డీటీగా, నావాబ్ పేట డీటీ గాయత్రిని మహబూబ్నగర్ డీటీగా, రూరల్ డీటీ సువర్ణను నవాబ్ పేట్ డీటిగా నియమించారు.
జిల్లాలో పనిచేస్తున్న నలుగురు తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బదిలీ చేశారు. జడ్చర్ల తహశీల్దారు బ్రహ్మం గౌడ్ ను సెక్రటేరియట్ కు బదిలీ చేయగా ఆయన స్థానంలో కలెక్టరేట్లోని ఈ సెక్షన్ తహశీల్దారు నర్సింగ్రావును నియమించారు. కలెక్టరేట్ ఈ సెక్షన్ తహశీల్దార్గా అడ్డాకుల తహశీల్దారు మదన్మోహన్ను నియమించగా, సెక్రటేరియట్ నుంచి శేఖర్ అడ్డాకుల తహశీల్దారుగా నియమితులయ్యారు. వీరు బాధ్యతలు స్వీకరించారు.
ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించడానికి అవకాశం కల్పించినట్లు DIEO కౌసర్ జహాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయోగ పరీక్షలను ఈనెల 18 నుంచి 21 వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. హాజరుకాని విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ & మూడవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో 1945 మందికి గాను..1854 మంది విద్యార్థులు హాజరయ్యారని, 91 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారి డా.రాజకుమార్ తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా ఏర్పాటు చేశామన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ జెండా ఎగురవేయాలని ఎంపీ డీకే అరుణ సోమవారం అన్నారు. మూసాపేట మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ల వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మూసాపేట, తుంకిల్ పూర్, సంకలమద్ది గ్రామాల నుంచి 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.
NRPT జిల్లాలో వేల ఎకరాలలో ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఈమధ్య కాలంలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోందని సంతోషించే లోపే చిరుతల అనుమానాస్పద మృతి ఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి. మద్దూరు, దామరగిద్ద మండలాల్లో ఇటీవల ఐదు చిరుత పులులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. జాదరావుపల్లి, నందిపాడు ఉడుమల్గిద్ద, కంసాన్ పల్లి, వారం క్రితం ఉడ్మల్గిద్దలో నిన్న మోమినాపూర్లో అనుమానాస్పదంగా చిరుతలు మృత్యువాత పడ్డాయి.
Sorry, no posts matched your criteria.