India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిన్నచింతకుంట మండలంలో చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కౌకుంట్ల మం. అప్పంపల్లికి చెందిన మహేశ్(25) తనకున్న గొర్రెలను స్నానం చేయించేందుకు అప్పంపల్లి-ఏదులాపురం మధ్యలో ఉన్న వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం సమీపంలోని నీటి గుంతకు తీసుకొచ్చాడు. గొర్రెలకు స్నానం చేయిస్తుండగా కాలుజారి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
రాజాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో పూజ చేయించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
నవాబుపేట మండలంలో దారుణం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విజయ్ కుమార్‌పై అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు 108 సిబ్బంది ద్వారా మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రం తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 700 ఏళ్లనాటి మర్రి చెట్టు అందరినీ ఆకట్టుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద పరిమాణం గల మూడో చెట్టుగా ఇది పేరుగాంచింది. దూరం నుంచి చూస్తే కొండలాగా కనిపించే ఇది దగ్గరికెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా మారిపోతుంది. మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న దీని పక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణానికి 4KM దూరంలోనే ఉంది. సందర్శించారా? కామెంట్ చేయండి.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహాన్ని రెస్క్యూటీమ్ గుర్తించారు. టీబీఎం మెషీన్‌లో మృతదేహం ఇరుక్కున్నట్టు నిర్ధారించారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయక బృందాలు డ్రిల్లింగ్ చేస్తున్నాయి. అయితే TBM ముందు భాగంలో దుర్వాసన వస్తున్నందున్నారు. ఆచూకీ కోసం 15 రోజులుగా శ్రమిస్తున్నారు.
జాతరకు తీసుకెళ్లడం లేదని ఓ చిన్నారి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. 9ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. వెల్దండ మండలంలో ఉన్న గుండాల శ్రీఅంబాల రామలింగేశ్వర స్వామి జాతరకు తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. వారు వద్దనడంతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌ను తవ్వితే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టాయి. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో మహిళా దినోత్సవ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య జిఎన్. శ్రీనివాస్ కలిసి విశ్వవిద్యాలయ అభివృద్ధి గురించి చర్చించారు. ఇంజనీరింగ్, లా కళాశాలల ప్రారంభోత్సవం, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ, అదనపు పోస్టుల మంజూరు తదితర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.