Mahbubnagar

News April 4, 2025

మహబూబ్‌నగర్: ఘనంగా వేడుకలు నిర్వహించాలి: బీజేపీ 

image

మహబూబ్‌నగర్‌లోని బీజేపీ జిల్లా ఆఫీస్‌లో జిల్లా స్థాయి ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి 13 వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, 14 నుంచి 25 వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ, జనగణన, జమిలి ఎన్నికలు, రైతుల సమస్యలపై బూత్ కమిటీలు వేసి చర్చించాలని అన్నారు. 

News April 4, 2025

MBNR: స్థానిక సంస్థల బరిలో పోటీకి యువత సై!

image

త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు యువత సిద్ధం అవుతోంది. ఓ వైపు ప్రభుత్వాలు తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, మరో వైపు తమ సమస్యల పరిష్కారం కోసం తామే ఎన్నికల బరిలో నిలవాలని తలుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుతో పాటు రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే అన్ని పార్టీలు ఏ మేరకు వారికి సీట్లు కేటాయిస్తాయో వేచి చూడాలి.

News April 4, 2025

MBNR: ముగ్గురిపై కేసు నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బిల్డింగ్‌తండా గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమయంలో బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ లెనిన్‌తో బిల్డింగ్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయిలకుంట తండాకు చెందిన ముగ్గురు దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 4, 2025

మహబూబ్‌నగర్: రెడ్ క్రాస్ డయాగ్నొస్టిక్ స్థలానికి గవర్నర్‌కి ఎమ్మెల్యే వినతి

image

మహబూబ్‌నగర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్‌కు కేటాయించి అధునాతన భవన నిర్మాణానికి చేయూత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఎలాంటి లాభపక్ష లేకుండా ఎన్నో సంవత్సరాలుగా పట్టణ ప్రజలకు ఆపత్కాలంలో సేవలు అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి ప్రాణం పోస్తున్నామన్నారు.

News April 4, 2025

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు 

image

ఈనెల 7 నుంచి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జులు, ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరి ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, బి గ్రేడ్ రకానికి రూ.2,300 ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.

News April 4, 2025

MBNR: ముగ్గురిపై కేసు నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బిల్డింగ్‌తండా గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమయంలో బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ లెనిన్‌తో బిల్డింగ్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయిలకుంట తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 4, 2025

మహబూబ్‌నగర్‌: హోటళ్లలో అధికారుల తనిఖీలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారి మనోజ్ అధికారంలో తనిఖీలు నిర్వహించారు. పలు హోటళ్ల నుంచి బిర్యానీ శాంపిల్స్ సేకరించి లాబొరేటరీకి పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంపిల్స్‌లో ఏమైనా కల్తీ నిర్ధారణ జరిగితే సదరు హోటళ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

News April 4, 2025

మహబూబ్‌నగర్: ఏప్రిల్ 14లోపు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్ 

image

రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఏప్రిల్ 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో స్పెషల్ అధికారులు, బ్యాంకర్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అర్హులకు రూ.50 వేల నుంచి రూ.నాలుగు లక్షల వరకు రుణం మంజూరు చేస్తామన్నారు. అర్హులైన వారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 4, 2025

‘మహబూబ్‌నగర్ జిల్లాలో యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం’

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌ఛార్జ్ అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీనిని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

News April 3, 2025

మహబూబ్‌నగర్: ‘దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు కొమురయ్య’

image

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.